ఒకే ఇంట్లో 32 మందికి కరోనా పాజిటివ్..!

దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

దేశంలోని పలు ప్రాంతాల్లో కుటుంబాలకు కుటుంబాలే వైరస్ బారిన పడుతున్నాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒకే కుటుంబంలో 32 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

రాష్ట్రంలోని బండా జిల్లాలో ఒకే ఇంట్లో 32 మంది కరోనా బారిన పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి కుటుంబంలో 32 మంది ఉంటే 32 మందికి వైరస్ సోకిందని తెలిపారు.

ఒకే ప్రాంతంలో ఒకే కుటుంబంలో భారీగా కేసులు నమోదు కావడంతో అధికారులు ఆ ప్రాంతంలో వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన వారికి, ఆ ప్రాంతంలో కరోనా లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ఆ ప్రాంతానికి చెందిన మరో 44 మందికి కూడా కరోనా సోకిందని తేలింది.

బండా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్.డీ.

శరమ ఈ విషయాలను వెల్లడించారు.కొత్తగా నమోదైన కేసులతో బండా జిల్లాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 807కు చేరిందని చెప్పారు.

కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.

రాష్టంలో ఇప్పటివరకు 2,30,414 కేసులు నమోదు కాగా 3,486 మంది మృత్యువాత పడ్డారు.

మరోవైపు దేశంలో ప్రతిరోజూ 60,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

బక్కగా ఉన్న పిల్లలు బరువు పెరిగి బ‌లంగా మారాలంటే ఇలా చేయండి!