CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?
TeluguStop.com
ప్రస్తుతం తెలంగాణాలో సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ ( CMR Girls Hostel )బాత్ రూముల్లో కెమెరాలు అమర్చి సీక్రెట్‌గా వీడియోలు తీశారనే అంశం హాట్ టాపిక్ అవుతున్న తరుణంలో గంటకో నిజం బయటకు వస్తోంది.
విషయంలోకి వెళితే.హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా, కండ్లకోయలోని మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ బాత్ రూముల్లో కెమెరాలు ఉన్నాయనే కారణంగా విద్యార్థినులు( Female Students ) గత రాత్రి ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో హాస్టల్‌లో పని చేసే వంట సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేయగా వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్స్ వినబడుతున్నాయి.
"""/" /
కాగా ఈ విషయమై సర్వత్రాల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోపక్క విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ కేసు విషయంలో పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకోగా.
ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు వినికిడి.నిందితులు బాత్రూమ్‌లో కెమెరాలు( Cameras In The Bathroom ) పెట్టి సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపించడం కొసమెరుపు.
అవి సోషల్ మీడియాలో లీక్ అయితే తమ పరిస్థితి ఏంటని చాలామంది విద్యార్థినిలు లబోదిబో అంటున్నారు.
కాగా ఈ ఘటనపై ఇప్పటికీ కాలేజీ యాజమాన్యం స్పంచికపోవడం గమనార్హం. """/" /
దాంతో వీడియోల ఘటనపై కాలేజీ యాజమాన్యం ( College Proprietorship )వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ విద్యార్థినులకు హామీ ఇవ్వడంతో కాస్త తగ్గినట్టు తెలుస్తోంది.హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని, ఈ విషయం వార్డెన్‌కు చెప్పామని, కానీ ఈ విషయంలో హాస్టల్ వార్డెన్ వారికే వత్తాసు పలుకుతూ.
తమపైనే అసభ్యంగా మాట్లాడారని బాధిత స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేయడం బాధాకరం.ఈ ఘటనకు మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డే బాధ్యత వహించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
కాగా సీఎంఆర్ లాంటి టాప్ కాలేజీలో ఇటువంటి ఘటన వెలుగు చూడటం కలకలం రేపుతోంది.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?