30 వెడ్స్ 21 అనన్యాకి ఆ యువ క్రికెటర్ క్రష్..!

ఒకే ఒక్క వెబ్ సీరీస్ తో యూత్ ఆడియెన్స్ కు దగ్గరైంది అనన్య.

చాయ్ బిస్కెట్ తెరకెక్కించిన 30 వెడ్స్ 21 వెబ్ సీరీస్ తో అలరించిన అనన్యా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అమ్మడి అందం, అభినయం యూత్ ఆడియెన్స్ ను నిద్రపట్టకుండా చేస్తున్నాయి.ఆమెకు ఉన్న క్రేజ్ తోనే వెబ్ సీరీస్ పూర్తయినా సరే చైతన్య, అనన్యాలతో షోలు చేస్తున్నారు.

ఈమధ్యనే జబర్దస్త్ లో కనిపించి అలరించిన ఈ జోడీ లేటెస్ట్ గా సుమ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్షమయ్యారు.

సీనియర్ యాంకర్ సుమ యూట్యూబ్ ఛానెల్ లో క్రేజీ కిచెన్ అనే ప్రోగ్రాం లో చైతన్య, అనన్యా కనిపించారు.

ఇద్దరు సెపరేట్ గా పిజ్జా చేసి చూపించారు.ఇక ఈ ప్రోగ్రాం లో అనన్యా క్రష్ గురించి చైతన్య చెప్పడం విశేషం.

ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అన్నట్టుగా అనన్యా క్రష్ ఎవరు అని చైతన్యని అడిగితే అల్లు అర్జున్ అంటాడు.

అయితే ఈలోగా అనన్యా ఇంకొకరు కూడా అన్నది క్రికెటర్ అని హింట్ ఇస్తే.

దేవదత్ పడిక్కల్ అని చెప్పాడు .ఐపిఎల్ లో ఆర్సీబీ తరపున ఆల్ రౌండర్ గా ఆడే దేవదత్ పడిక్కల్ ఈమధ్యనే ఇంటర్నేషనల్ టీం కు సెలెక్ట్ అయ్యాడు.

అతనంటే తనకు చాలా ఇష్టమని ఓపెన్ గా చెప్పేసింది అనన్యా.

మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!