ఆ బ్లాక్ బస్టర్ మూవీని సమంత రిజెక్ట్ చేశారా..?

ప్రదీప్, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో ఫణి ప్రదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

పెట్టుబడితో పోలిస్తే భారీగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ మొదట సమంతకు వచ్చిందని కొన్ని కారణాల వల్ల సమంత ఈ సినిమాలో నటించే ఆఫర్ ను వదులుకున్నారని తెలుస్తోంది.

"""/"/ ఈ సినిమా డైరెక్టర్ ఫణి ప్రదీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.

సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడగా ఈ పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

తాను సమంత మేనేజర్ ను కలిసి కథ వినిపించానని సమంత మేనేజర్ కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారని ఫణి ప్రదీప్ అన్నారు.

"""/"/ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథ సమంతకు బాగా నచ్చిందని అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల సమంత ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఫణి ప్రదీప్ చెప్పుకొచ్చారు.

సమంత ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే హీరో కోసం కూడా తాను ప్రయత్నాలు చేసేవాడినని ఫణి ప్రదీప్ వ్లెలడించారు.

ఆ తర్వాత ప్రదీప్ హీరోగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా ఎంపిక కావడం జరిగిందని ఫణి ప్రదీప్ తెలిపారు.

తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 30 రోజులో ప్రేమించడం ఎలా రిలీజ్ కాగా ఓటీటీలో ఈ సినిమాకు భారీగా వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది.

థియేటర్లలో విడుదలైన మూడు నెలల తరువాత ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం గమనార్హం.

ఆ సంస్థ ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయిన హీరోయిన్ శృతి హాసన్.. ఏం జరిగిందంటే?