వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి 30 లక్షల కాంట్రిబ్యూషన్ ఇస్తా : కెటిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం( Sri Venugopala Swamy Temple ) నిర్మాణానికి 30 లక్షల కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి కెటిఆర్( KTR ) అంగీకారం తెలిపినట్లు నంది కిషన్ తెలిపారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక కోటి ఎనభై లక్షలు మొదటి విడతగా మూడు నెలల క్రితం మంజూరు చేసింది.

అట్టి నిదులను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కు బదిలీ చేసింది , 90 లక్షలు రెండవ విడుత మంజూరు చేయడానికి 30 లక్షల కాంట్రిబ్యూషన్ చెల్లించాలని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కోరగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah ) ఆద్వర్యంలో జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ చైర్మన్ నంది కిషన్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం లు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసన సభ్యులు కెటిఆర్ ను గురువారం కలుసుకొని 30 లక్షలు కాంట్రిబ్యూషన్ ఇప్పించాలని కోరగా ఇవ్వడానికి కెటిఆర్ అంగీకారం తెలిపారు.

మొత్తం కాంట్రిబ్యూషన్ తో కలిపి మూడు కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించిన కెటిఆర్ కు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య నంది కిషన్ ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మంజూరైన నిధులతో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ త్వరలో టెండర్లు నిర్వహించనుంది.

ఆ తేదీన విడుదల కానున్న చైతన్య తండేల్.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!