సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవటానికి ఆపిల్ సైడర్ వినెగర్ ఎలా సహాయపడుతుందో చూడండి
TeluguStop.com
సైనస్ ఇన్ఫెక్షన్ ను వైద్య పరంగా సైనసిటిస్ అని పిలుస్తారు.నాసికా
కుహరంలో వాపు కారణంగా ఈ పరిస్థితి వస్తుంది.
నాసికా కుహరంలో బాక్టీరియా
పెరిగి తరచూ రొంప మరియు నొప్పి వస్తుంది.సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధ
పడుతున్న వారిలో ముఖం, ముక్కు మరియు కళ్ళ చుట్టూ ఒత్తిడి గా
అనిపిస్తుంది.
అలాగే తలనొప్పి, నాసికా రద్దీ, ముక్కు నుండి దళసరి పసుపు
ద్రవం విడుదల,జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి.
సైనస్ ఇన్ఫెక్షన్
నివారణకు ఆపిల్ సైడర్ వినెగర్ బాగా సహాయపడుతుంది.h3 Class=subheader-style1.
ఆపిల్ సైడర్ వినెగర్/h3p సైనస్ ఇన్ఫెక్షన్ ని సులభంగా మరియు సమర్ధవంతంగా తగ్గించే ఇంటి నివారణలో
ఇది ఒకటి అని చెప్పవచ్చు.
H3 Class=subheader-styleకావలసినవి/h3p
ఆపిల్ సైడర్ వినెగర్ - 1 స్పూన్
H3 Class=subheader-styleపద్దతి/h3p
* ప్రతి రోజు ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వినెగర్ ని రోజులో మూడు సార్లు
తీసుకుంటే సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
* ఆపిల్ సైడర్ వినెగర్ ని ఉపయోగించటం వలన సైనస్ ఇన్ఫెక్షన్ ని నయం
చేయటమే కాకుండా మరల రాకుండా చేస్తుంది.
H3 Class=subheader-style2.ఆపిల్ సైడర్ వినెగర్ డ్రింక్/h3p
ఇది సైనస్ ఇన్ఫెక్షన్ కోసం మరొక సమర్థవంతమైన నివారణగా చెప్పవచ్చు.
దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఖచ్చితంగా సైనస్ ఇన్ఫెక్షన్
వదిలించుకోవటం కొరకు సహాయం చేస్తుంది.
H3 Class=subheader-styleకావలసినవి/h3p
ఆపిల్ సైడర్ వినెగర్ - 2 స్పూన్స్
నీరు - 8 ఔన్సులు
H3 Class=subheader-styleపద్దతి/h3p
* ఒక గ్లాసులో 8 ఔన్సుల నీటిని తీసుకోని దానిలో ఆపిల్ సైడర్ వినెగర్ ని కలపాలి.
* ఈ మిశ్రమాన్ని కలిపిన వెంటనే త్రాగాలి.* ఈ డ్రింక్ ని తరచుగా తీసుకుంటే సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గటంలో సహాయపడుతుంది.
!--nextpage
H3 Class=subheader-style3.ఆపిల్ సైడర్ వినెగర్ ఆవిరి/h3p
ఆపిల్ సైడర్ వినెగర్ తో ఆవిరి పెడితే నాసికా రంద్రాలు క్లియర్ అయ్యి
సైనస్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనంను కలిగిస్తుంది.
అంతేకాక ఆపిల్ సైడర్
వెనిగర్ లో ఉండే యాంటి బాక్టీరియా మరియు యంటి ఫంగల్ లక్షణాలు సైనస్
కావిటీస్ లో ఇన్ఫెక్షన్ ను కలిగించే బాక్టీరియాను చంపటంలో సహాయపడతాయి.
H3 Class=subheader-styleకావలసినవి/h3p
నీరు - ½ కప్పు
ఆపిల్ సైడర్ వినెగర్ - ½ కప్పు
ఒక టవల్
ఒక సాస్ పాన్
H3 Class=subheader-styleపద్దతి/h3p
* ఒక సాస్ పాన్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీటిని పోయాలి.
* ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు వేడి చేయాలి.
* ఒక టవల్ ని మెడ,తల కవర్ అయ్యేలా కప్పుకొని ఆవిరి పట్టాలి.
* ఈ విధంగా రోజులో అనేక సార్లు చేస్తే సైనస్ ఇన్ఫెక్షన్ మరియు లక్షణాలు
నయం అవుతాయి.
రియల్ డాకు మహారాజ్ స్టోరీ మీకు తెలుసా.. వామ్మో ఏకంగా అన్ని హత్యలు చేశాడా?