రాత్రంతా స్మార్ట్ ఫోన్ ని తల దగ్గర ఉంచుకొని నిద్రపోతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు స్మార్ట్ ఫోన్( Smartphone ) తోని ఎక్కువగా గడుపుతున్నారు.
స్మార్ట్ ఫోన్ లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేక పోతున్నారు.అలాగే చాలా మంది నిద్రపోయేటప్పుడు దిండు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంచి నిద్రపోతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే వారికి ఈ అలవాటు ప్రాణాంతకం అవుతుందని చెబుతున్నారు.
అందుకే మొబైల్ ఫోన్లను సైలెంట్ కిల్లర్స్ అని కూడా పిలుస్తున్నారు.రాత్రి సమయంలో ఛార్జ్ చేయడం వల్ల మొబైల్ వేడెక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాంటి పరిస్థితిలో మొబైల్ వేడెక్కడం వల్ల పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.స్మార్ట్ ఫోన్లు మెదడుకు మంచి చేయని విద్యుత్ అయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి.
"""/"/
ఈ తరంగాలు మన చుట్టూ చాలా కాలంగా ఉంటే ప్రవర్తనలో మార్పు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రంతా ఫోన్ ని తలకు దగ్గరగా ఉంచి ఛార్జ్ చేయకూడదు.అలాగే నిద్రలో ఫోన్ పక్కనే ఉండడం వల్ల ఫోన్ నోటిఫికేషన్ ల వల్ల నిద్రకు కూడా ఆటకం కలుగుతుందని చెబుతున్నారు.
దీని వల్ల నిద్ర లేకపోవడం, అనేక శరీర సమస్యలకు దారి తీస్తుంది.మీకు తగినంత నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు మీరు సరిగ్గా పని చేయలేరు.
రోజంతా తాత్కాలిక బలహీనత కూడా ఉంటుంది.అది మన ఆలోచన సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
"""/"/
అంతేకాకుండా మొబైల్ ఫోన్ విడుదల చేసే బ్లూ లైట్( Smartphone Light ) మన కళ్ళకు కూడా చికాకు కలిగిస్తూ ఉంటుంది.
అందుకోసమే నిద్రపోయేటప్పుడు స్మార్ట్ ఫోన్ ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఫోన్ చార్జింగ్ చేసేటప్పుడు చుట్టూ మండే వస్తువులు లేని ప్రదేశంలో ఉంచాలి.
మొబైల్ ఫోన్ ని ఉపయోగించడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి.ఇది రోగనిరోధక వ్యవస్థ( Immunity Power ) పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఇలా చేయడం వల్ల రోజంతా తక్కువ ఆకలి వేయడం, శ్వాస ఆడక పోవడం, అధిక రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కు పోటీగా అనుష్క సినిమా.. ఇది నిజంగా భారీ షాక్ అంటూ?