కువైట్ అగ్నిప్రమాదం: మృతుల్లో ముగ్గురు ఏపీవాసులు .. స్వగ్రామాల్లో విషాదఛాయలు

గల్ఫ్ దేశం కువైట్‌లో( Gulf Country Of Kuwait ) జరిగిన ఘోర అగ్నిప్రమాదం భారతదేశంలో తీవ్ర విషాదానికి కారణమైంది.

ఈ ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోతే.వారిలో 45 మంది భారతీయులే కావడం గమనార్హం.

వీరిలోనూ ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందినవారే కావడంతో ఆ రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు .కువైట్ అగ్నిప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వీరిని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర( Jinkibhadra ) గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు మరణించినట్లుగా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీ) తెలిపింది.

వీరి ముగ్గురి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నానికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటాయి అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

"""/" / కాగా.కువైట్‌లోని అల్ మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళలోని కొచ్చికి చేరుకున్నాయి.

వాయుసేన ప్రత్యేక విమానంలో భౌతికకాయాలను కువైట్‌ నుంచి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సహా పలువురు విమానాశ్రయం వద్దకు చేరుకుని సమీక్షిస్తున్నారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ కువైట్‌కు వెళ్లారు.

ఆయన అక్కడి పరిస్ధితులను సమీక్షించి.మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు కృషి చేశారు.

"""/" / మరోవైపు కువైట్ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.

5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.అలాగే ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలు లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ రూ.

5 లక్షలు, రవి పిళ్లై రూ.2 లక్షల చొప్పున బాధితులకు పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే … ? టీటీడీ క్లారిటీ