తండేల్ ఒక్క పాట కోసం 900 డాన్సర్.. మూడు కోట్ల ఖర్చు.. సాహసం చేస్తున్న ప్రొడ్యూసర్!

అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ చందు మొండేటి ( Chandu Mondeti ) దర్శకత్వంలో తండేల్ ( Thandel ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

చేపలు పట్టడం కోసం వెళ్లినటువంటి కొంతమంది భారతీయ జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ లోకి అడుగుపెట్టడంతో అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది.

"""/" / ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో నటించబోతున్నారు.

అలాగే హీరోయిన్ గా సాయి పల్లవి ( Sai Pallavi ) నటిస్తున్న తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం హైదరాబాద్ శివారులో భారీ జాతర సెట్ వేసారని అక్కడ ఈ సినిమాల్లో ఒక పాట షూటింగ్ జరుగుతుందని సమాచారం.

ఈ పాట షూటింగ్లో భాగంగా ఏకంగా 900 మంది డాన్సర్స్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

"""/" / ఇలా 900 మంది డాన్సర్స్ ఒక పాటలో పాల్గొంటున్నారు అంటే ఆ పాట కోసం భారీ స్థాయిలో కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి.

అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో అల్లు అరవింద్ ( Allu Aravind ) పెద్ద ఎత్తున సాహసం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ పాట షూటింగ్ కోసమే ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.

ఇలా ఈ పాట కోసమే మూడు కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇక నాగచైతన్య కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈయన ఇది వరకే గీత ఆర్ట్స్ బ్యానర్ లో 100% లవ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టారు.

దీంతో అల్లు అరవింద్ సైతం ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదని తెలుస్తోంది.

నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?