జగన్ మాస్టర్ ప్లాన్.. త్వరలో ఏపీలో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు?

జగన్ మాస్టర్ ప్లాన్ త్వరలో ఏపీలో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మూడు రాజధానుల విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు.

జగన్ మాస్టర్ ప్లాన్ త్వరలో ఏపీలో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు?

ఏపీ ప్రజల్లో ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్ళడానికి అలాగే ఈ అంశాన్ని ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తున్నారో తెలుసుకోవడానికి ఓ ప్లాన్‌ను అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

జగన్ మాస్టర్ ప్లాన్ త్వరలో ఏపీలో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు?

ఈ అంశంలో ప్రజల నాడిని పరీక్షించడానికి రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లుగా సమాచారం.

వైఎస్సార్‌సీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చను చూస్తే ఇలా జరగవచ్చనే సమాధానం వినిపిస్తోంది.ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా పిచ్ అవుతున్న విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా ఉప ఎన్నికలు జరగాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ఉప ఎన్నికలకు వెళ్లే రెండు నియోజకవర్గాలు: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం (ఉత్తర), కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానంగా తెలుస్తోంది.

"""/"/ స్పీకర్ ఫార్మాట్‌లో సమర్పించిన గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలపాల్సి ఉంది.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజనామను సమర్పించారు.

మరోవైపు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా జగన్ ప్రభుత్వం చేస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా ధర్మశ్రీ తన సీటుకు రాజీనామా చేశారు.

ఆయన తన రాజీనామా లేఖను నిర్ణీత ఫార్మాట్‌లో పంపనప్పటికీ, సాధారణ ఫార్మాట్‌లో మళ్లీ అసెంబ్లీ సీటు రాజీనామ చేయాల్పిందిగా కోరవచ్చు.

రెండు రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే ఈ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

మూడు రాజధానుల ప్రణాళికపై ఈ రెండు నియోజకవర్గాల ప్రజల మద్దతు కోరుతూ జగన్ ఉప ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొమరం భీముడో పాటలో ఆ సీన్లు నావే.. జూనియర్ ఎన్టీఆర్ డూప్ షాకింగ్ కామెంట్స్ వైరల్!