వామ్మో అది బస్సా లేక ఆటోనా.. మరీ 27 మంది ఏంటి బ్రో..!

చూసేందుకు ఆటోలాగానే ఉంది కానీ అందులో ఉన్న మందిని చూస్తే మాత్రం బస్సే అనిపిస్తుంది.

ఆటో నిండుగా బయటకు సగం సగం వచ్చేలా కూర్చొని ఉన్న వారిన చూస్తే ఎక్కడ పడిపోతారననే భయం వేస్తుంది.

అయినా వారు ఎలాంటి భయం లేకుండా ఆటోలో ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు.

అయితే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఏడుగురు కూర్చోవాల్సిన ఒక ఆటోలో మొత్తం 27 మంది కూర్చొని ప్రయాణం చేస్తున్నారు.

అయితే వాళ్లంతా ఎవరూ ఎందుకలా ప్రయాణం చేశారు, ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో ఓ ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు.

7 సీటర్ ఆటోలో ఏకంగా 27 మంది కూర్చన్నారు.ఇంత మందిని కూర్చోబెట్టుకున్నా ఎలాంటి భయం, బెరుకు లేకుండా డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో ఆటోను నడిపాడు.

అయితే ఆటో ఓవర్ స్పీడ్ చూసిన పోలీసులు దాన్ని ఆపగా.అందులో ఉన్న వాళ్లను చూసి షాకయ్యారు.

వృద్ధులు, చిన్నారులతో కలిసి మొత్తం 27 మందిని అంగుళం గ్యాప్ లేకుండా కూర్చోబెట్టాడు.

పోలీసులు వారందరినీ కిందకు దింపి లెక్కించారు.అనంతరం ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.

అంతేకాకుండా 11.500 రూపాయల జరిమానా కూడా విధించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.అంత మంది ఉన్నా ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న డ్రైవర్ చూసి.

నెటిజెన్లు ఏంటి బ్రో ఇదంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో: అజిత్ ధైర్యానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.. సినిమా కోసం ప్రాణాలనే పణంగా పెట్టి..?