ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా 26వ వార్షికోత్సవ వేడుకలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం బండ లింగంపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 26 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
సోమవారం ఉదయం సుప్రభాతం,స్వామివారి పల్లకి సేవ శోభయాత్ర గ్రామంలో ప్రధాన వీధుల గుండా కన్నుల పండుగగా ఆలయం చేరుకుంది.
అనంతరం స్వామివారికి నిత్య పూజ, కుంకుమ పూజ, గణపతి పూజ , స్వస్తి పుణ్యవచనం, నవకల్ష స్థాపన , నవగ్రహ పూజ , నవగ్రహ హోమం , హారతి, మంత్రపుష్పం , ఝత్విక్ ,మహాదాశీర్వచనం ,ఘనంగా జరిగాయి.
ఆ
లయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ బైరోజు అన్వేష్ ఆచార్య, బ్రహ్మశ్రీ ఉప్పుల అభిలాష్ ఆచార్య భక్తకోటికి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
అనంతరం అన్న ప్రసాదం వితరణ చేశారు.ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనం అధ్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి( Shri Brahmachari Lakshmareddy ) ఆద్వర్యంలో భగవద్గీత ఉపన్యాస కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముస్తాబాద్ శ్రీ రాజు గురుస్వామి పాల్గొన్నారు.ఆలయ కమిటీ అధ్యక్షులు నర్ర అంజిరెడ్డి, ధర్మకర్త బాలరాజు బాల్ నర్సా గౌడు, వార్షికోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
స్వామివారి ఆలయంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించగా 10 గ్రామాల భజన మండలిలు పాల్గొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.
అఖండ భజన కార్యక్రమంలో పాల్గొన్న భజన మండలి సభ్యులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : తమిళనాడులోని ఆ గ్రామంలో పండుగ వాతావరణం