నాన్‌ స్టాప్ ‌గా 260 కి.మీ. రైలును నడిపి కిడ్నాపర్ ను పట్టించిన లోకో పైలెట్ ..!

రైలు లోకో పైలెట్ సమయస్ఫూర్తి కారణంగా ఏకంగా 260 కిలోమీటర్ల దూరం రైలును ఎక్కడ కూడా ఆపకుండా ప్రయాణం చేసి కిడ్నపర్స్ నుండి పాపను కాపాడాడు.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలిక కిడ్నాప్ కు గురైంది.

అయితే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యంత్రాంగం మొత్తం చకచకా అలర్ట్ కావడంతో ఆ బాలికకు కిడ్నాపర్ నుండి విముక్తి కలిగింది.

ఇందులో భాగంగా ముఖ్యంగా రైలు నడిపిస్తున్న లోకో పైలెట్ ను రైలు ఎక్కడ ఆప వద్దని పోలీసులు చెప్పడంతో పాప ప్రాణాలు కాపాడటానికి ఆ లోకో పైలెట్ సిద్ధమయ్యాడు.

రైలు ప్రయాణించే సమయంలో ఎక్కడ ఏ స్టేషన్ వచ్చినా సరే రైలు ఆపకుండా అదేపనిగా 260 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లి ఓ రైల్వే స్టేషన్ లో ఆపేశాడు.

ఇక రైలు ఆపగానే పోలీసులు పాపను స్వాధీనం చేసుకుని కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు.

260 కిలోమీటర్లు ఏకధాటిగా ఏ స్టేషన్ లో రైల్ ఆపకుండా నాన్ స్టాప్ గా నడిపిన లోకో పైలెట్ కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంఘటన మొత్తం ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.

ఆ సమయంలో ఆ రైల్వే స్టేషన్ నుంచి భూపాల్ వెళ్లే రైలు ఎక్కాడు కిడ్నాపర్.

కిడ్నాపర్ రైలు ఎక్కడం గమనించిన పాప తల్లిదండ్రులు ఆ కిడ్నాపర్ రాప్తా సాగర్ అనే ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కినట్లు వారు గుర్తించారు.

వెంటనే వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో దాంతో ఆ రైలు లోకో పైలెట్ లను అప్రమత్తం చేశారు.

దీంతో ఆ లోకో పైలెట్ ఏకధాటిగా 260 కిలోమీటర్ల ఆపకుండా రైలు నడిపి చివరికి కిడ్నాప్ నుండి 3 ఏళ్ల బాలికను కాపాడారు.

పాపను కాపాడడంలో చొరవ చూపిన పోలీసులు, రైల్వే పోలీసులు, రైలు లోకో పైలెట్ ఇతరత్రా అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇకపోతే ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి రైల్వే లో జరగడం ఇదే అంటూ రైల్వే అధికారులు తెలిపారు.

వీడియో వైరల్: చేపలు పట్టేందుకు సరికొత్త టెక్నిక్ వాడుతున్న యువకుడు.. మీరు ట్రై చేస్తారా..