అమెరికాలో విషాదం.. నీటిలో మునిగి భారతీయుడు మృతి, వారంలో రెండో ఘటన

ఉన్నత విద్య కోసం అమెరికాకు( America ) వెళ్లిన భారతీయ విద్యార్ధుల అకాల మరణాలు, హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు.మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో ( Glacier National Park )మునిగి 26 ఏళ్ల భారత జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని సిద్ధాంత్ విఠల్ పాటిల్‌గా గుర్తించారు.ఇతను కాలిఫోర్నియా రాష్ట్రంలో పనిచేస్తున్నాడు.

స్నేహితులతో కలిసి గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్రకు వెళ్లగా.అక్కడ నీటిలో మునిగి సిద్ధాంత్ ప్రాణాలు కోల్పోయినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

పాటిల్ జూన్ 6న అవలాంచె లేక్ ట్రయిల్‌లో( Avalanche Lake Trail ) ఓ కొండగట్టుపైకి ట్రెక్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి నీటిలోపడి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు హెలికాఫ్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి.అయినప్పటికీ పాటిల్ మృతదేహం లభ్యం కాలేదని వార్తలు వస్తున్నాయి.

రాళ్లు, చెట్ల మధ్యలో అతని మృతదేహం చిక్కుకుపోయి ఉండొచ్చని రేంజర్లు అనుమానిస్తున్నారు.అయినప్పటికీ పాటిల్ డెడ్ బాడీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇందుకోసం డ్రోన్లను సైతం రంగంలోకి దించారు. """/" / కాగా .

రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఘటనలో ఓ భారతీయ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్( Gadde Sai Surya Avinash ) (26) న్యూయార్క్ నగర సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతంలో మునిగి మృతిచెందాడు.

జూలై 7 ఆదివారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. """/" / నీటి ఉదృతికి అవినాష్ కాలుజారి జలపాతంలో కొట్టుకుపోయాడు.

అతడిని రక్షించేందుకు మరొకరు నీటిలో దూకగా అతను కూడా కొట్టుకుపోయాడు.అయితే రెస్క్యూ సిబ్బంది వేగంగా స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

అవినాష్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండం చిట్యాల గ్రామం.ఇతను ఎంఎస్ చేయడానికి గతేడాది అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అవినాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు .

వివాదాల వల్లే రాజ్ తరుణ్ సినిమాలు నిండా మునిగాయా.. పాజిటివ్ టాక్ వచ్చినా లాభం లేదా?