25వ సవరణ..నాకే నష్టం లేదు, బైడెన్‌కే ఇబ్బంది: తేల్చిపారేసిన ట్రంప్

క్యాపిటల్ భవనంలోకి తన మద్ధతుదారులను ఉసిగొల్పడంతో ట్రంప్‌పై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

దీంతో ఆయనను గడువుకు ముందే పదవిలోంచి తొలగించేందుకు వున్న సాధ్యాసాధ్యాలపై రిపబ్లికన్లు, డెమొక్రాట్లు పరిశీలిస్తున్నారు.

దీనిలో భాగంగా అధ్యక్షుడిగా తొలగించడంతో పాటు మళ్లీ జీవితంలో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వీలు లేకుండా చేస్తున్నారు.

ఇప్పటికే ట్రంప్‌పై డెమొక్రాట్లు.ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానానికి రిపబ్లికన్లు కూడా మద్ధతు తెలపడం విశేషం.దిగువ సభలో డెమొక్రాటిక్ పార్టీ సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న డేవిడ్ సిసిలీన్ ఈ అభిశంసన తీర్మానాన్ని తయారు చేశారు.

దీనికి 185 మంది మద్ధతు తెలిపారు.మరోవైపు ట్రంప్ మంత్రివ‌ర్గ‌మే స‌భ‌లో ఆయ‌న‌పై 25వ స‌వ‌ర‌ణ‌ను ప్ర‌వేశ‌పెట్టి పదవిలోంచి తొల‌గించేలా ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్‌పై డెమొక్రాట్లు ఒత్తిడి తెస్తున్నారు.

"""/"/ దీనిపై ట్రంప్ స్పందించారు.డెమొక్రా‌ట్‌ల ప్ర‌య‌త్నాల‌ను ఆయన తేలిగ్గా తీసిపారేశారు.

25వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌తో త‌న‌కు ఏమాత్రం రిస్క్ ఉండ‌బోద‌ని తేల్చి చెప్పారు.త‌న‌పై 25వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ను ప్ర‌యోగిస్తే వ‌చ్చే న‌ష్ట‌మేం లేద‌న్నారు.

ఇదే సమయంలో జో బైడెన్‌ను మాత్రం ప‌ద‌విలో ఉన్నంతకాలం అది వెంటాడుతుంద‌ని పేర్కొన్నారు.

పైగా ఇలాంటి చ‌ర్య‌లు అమెరికా భ‌విష్య‌త్తుకే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ట్రంప్ హెచ్చ‌రించారు.అధ్య‌క్షుడిపై 25వ సవ‌ర‌ణ ప్ర‌యోగం దేశంలో అస్థిర‌త‌కు దారితీస్తుంద‌ని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి.మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం.

దేశ ఉపాధ్యక్షుడు, కేబినెట్ కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు.

ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.రెండోది అభిశంసన.

అధ్యక్షుడిని తొలగించాలంటూ మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదించిన తీర్మానాన్ని, సెనేట్‌ కూడా ఆమోదించాల్సి ఉంటుంది.

గ్రీన్‌కార్డే అంతిమ లక్ష్యం.. చిక్కుల్లో పడుతున్న భారతీయులు