చిరుకు ఈ రేంజ్ కు క్రేజా.. ఆ స్టేషన్ లో చిరంజీవిని చూస్తూ ప్రయాణికులు రైళ్లు ఎక్కకుండా ఆగిపోయారంటూ?

గుణశేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) నటించిన చిత్రం చూడాలని ఉంది.

అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.

కాగా ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా ఆగస్టు 25 తో పాతికేళ్లు పూర్తి చేసుకుంది.

దీంతో ఈ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు, విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి.

ఇందులో చిరంజీవి, అంజల ఝవేరిల( Anjala Jhaverila ) మధ్య వచ్చే రైల్వేస్టేషన్‌ లవ్‌ సన్నివేశం చాలా స్పెషల్‌.

"""/" / చిరు, అంజలిల మధ్య డైలాగ్స్‌ లేకుండా కేవలం హావభావాలతో ఆ సీన్‌ను తెరకెక్కించి అలరించారు గుణశేఖర్‌( Gunasekhar ).

ఆ సీన్‌ గురించి ఒక సందర్భంలో గుణశేఖర్‌ ఇలా పంచుకున్నారు.రైల్వేస్టేషన్‌లో ఆ లవ్‌ సీన్‌ దాదాపు పది నిమిషాలు ఉంటుంది.

చిరంజీవిగారికి అసలు డైలాగ్స్‌ ఉండవు.ఆయన స్టేషన్‌లో చైర్‌ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు.

చిరంజీవికి డైలాగ్‌ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు.

అలాంటిది అంత సేపు షూట్‌ చేశాము.ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు( Nampally ,Kachiguda Railway Stations ) కావాలని నేను అడిగాను.

నిర్మాత అశ్వనీదత్‌ గారు షాకైపోయారు.ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్‌ పెద్దది.

అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. """/" / మూడు రోజులు చిరంజీవిగారిని పెట్టుకుని షూట్‌ చేయడం చాలా కష్టం.

పైగా ఆయనతో షూటింగ్‌ అంటే రైల్వేశాఖ( Railways ) కూడా అనుమతి ఇవ్వదు.

ఎందుకంటే ఇక్కడ షూటింగ్‌ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది.రైళ్లు ఆగిపోతాయి.

సమయాలు మారిపోతాయి.అతి కష్టమ్మీద అనుమతి లభించింది.

ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్‌లోనే ఆగిపోయారట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గుణశేఖర్.

Lorem Ipsum Dolor Sit Amet