25 మంది వైద్యుల కృషి.. కోలుకున్న భారత సంతతి బిలియనీర్ యూసుఫ్ అలీ

హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతతి బిలియనీర్, లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ కోలుకున్నారు.

కేరళలోని కొచ్చిలో ఈ నెల 11న ఆసుపత్రిలో చేరిన బంధువును చూడటానికి యూసుఫ్ అలీ, ఆయన భార్య హెలికాప్టర్‌లో బయల్దేరారు.

షెడ్యూల్ ప్రకారం పనంగడ్లోని ఫిషరీస్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్ దిగవలసి ఉంది.కానీ అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేల మీద హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.

అయితే.పక్కనే జాతీయ రహదారి, హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి.

చిత్తడి నేలలోనే హెలికాప్టర్ దిగడం వల్ల పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు యూసుఫ్ అలీ, అతని భార్య సహా మిగిలిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన యూసుఫ్‌ అలీ కోసం అబుదాబీలోని రాజకుటుంబం ప్రత్యేకంగా విమానం పంపింది.

దీనిలో ఆయన సోమవారానికి అబుదాబీ చేరుకున్నారు.అనంతరం స్థానిక బుర్జీల్ ఆసుపత్రికి అలీని తరలించారు.

మంగళవారం న్యూరో సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ షావర్బీ నేతృత్వంలోని 25 మంది వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా వెన్నెముక సర్జరీ నిర్వహించింది.

ప్రస్తుతం అలీ కోలుకుంటున్నారని లులు గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.కాగా, యూసుఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ క్రాష్ ల్యాండ్ అయ్యిందని తెలుసుకున్న అబుదాబీ యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్‌ మహమద్‌ బీన్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదానికి రెండు రోజుల క్రితమే యువరాజు నుంచి అబుదాబీ అత్యున్నత పురస్కరాన్ని అందుకున్నారు అలీ.

వ్యాపారంతో పాటు సామాజిక విభాగాల్లో ఆయన దేశానికి అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అబుదాబీ ప్రభుత్వం తెలిపింది.

కేరళలో జన్మించిన అలీ.అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ గ్రూప్ వివిధ దేశాల్లో హైపర్‌మార్కెట్లు నిర్వహిస్తోంది.మధ్యప్రాచ్యంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌అలీ స్థానం సంపాదించారు.

ఇదే సమయంలో గల్ఫ్‌లోని అన్ని దేశాల అధినేతలతో సన్నిహిత సంబంధం వుండటంతో మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.

వ్యాపారంలో రాణిస్తూనే.సమాజానికి ఎంతో కొంత చేయాలని ఆయన భావించారు.

దీనిలో భాగంగాగానే కోవిడ్ 19 విపత్కర కాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.

25 కోట్లు, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్లు, యూపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.

5 కోట్లు, హర్యానా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించారు.

అలాగే మధ్యప్రాచ్యంలో భారతీయుల తరపున పనిచేస్తున్న సామాజిక, సాంస్కృతిక సంస్థలకు కోటి రూపాయలు అందజేశారు.

విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..?