వృద్ధుడిలా వేషం మార్చి భారత్ నుంచి కెనడాకు వెళ్లే యత్నం.. అధికారులు అలర్ట్‌గా లేకుంటే..?
TeluguStop.com
వృద్ధుడిగా వేషం మార్చి భారత్ నుంచి కెనడాకు ప్రయాణించేందుకు ప్రయత్నించిన 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని గురుసేవక్ సింగ్‌గా( Gursewak Singh ) గుర్తించారు.ఇతను జుట్టు, గడ్డానికి తెల్లరంగు వేసి వృద్ధుడిగా( Elderly Man ) వేషం మార్చి మంగళవారం సాయంత్రం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని( Indira Gandhi International Airport ) టెర్మినల్ 3 వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు.
దీంతో అక్కడ భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది గురుసేవక్‌ను అడ్డగించి.ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
"""/" /
ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.గురుసేవక్ తొలుత అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని తనిఖీ చేసినట్లు తెలిపారు.
అతను తన గుర్తింపు పత్రాల కోసం .తన పేరును పాస్‌పోర్ట్‌లో రష్‌విందర్ సహోటా (67)గా( Rashvindar Sahota ) పేర్కొన్నాడు.
గురుసేవక్ ఢిల్లీ నుంచి బయల్దేరే ఎయిర్ కెనడా విమానంలో( Air Canada Flight ) ఎక్కాల్సి ఉందని సదరు అధికారి వెల్లడించారు.
పాస్‌పోర్టులో( Passport ) పేర్కొన్న వివరాలతో పోల్చి చూసినప్పుడు గురుసేవక్ రూపం, గొంతు, అతని చర్మం, శరీర ఆకృతి చిన్న వయసు వ్యక్తిలా కనిపించాయని ఆ అధికారి పేర్కొన్నారు.
అనుమానమొచ్చి నిశితంగా పరిశీలించగా.అతను తన జుట్టు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడని, పెద్ద వయస్కుడిగా కనిపించడానికి గాజులు ధరించినట్లు ఆయన చెప్పారు.
"""/" /
సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి అదుపులోకి తీసుకున్న అనంతరం ఢిల్లీ పోలీసులు( Delhi Police ) గురుసేవక్ సింగ్‌ను తమదైన శైలిలో ప్రశ్నించారు.
దీంతో తన వయసు, అసలు పేరును వెల్లడించినట్లు ఆ అధికారి పేర్కొన్నారు.గురుసేవక్ సింగ్ , 24 పేరుతో ఉన్న పాస్‌పోర్ట్‌ను అధికారులు అతని మొబైల్ ఫోన్‌లో కనుగొన్నారు.
నకిలీ పాస్‌పోర్ట్, మోసపూరిత ప్రయాణం కేసు కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించారు.
అయితే గురుసేవక్ సింగ్ వేషం మార్చి వృద్ధుడిలా కెనడాకు ఎందుకు వెళ్లాలనుకున్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
వైరల్: పెగ్గేసిన అంకుల్.. అద్దం ముందు ఏం చేస్తున్నాడో చూడండి!