24 గంటల విద్యుత్ అబద్ధం..: మంత్రి ఉత్తమ్
TeluguStop.com
తెలంగాణలో మిషన్ భగీరథ పథకం( Mission Bhagiratha ) కూడా విఫలం అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పిందని తెలిపారు.
"""/" /
24 గంటల విద్యుత్ అబద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యుత్ సంస్థలు రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు.
నీటి పారుదల కోసం రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు.సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 14 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్( BRS ) రెండు స్థానాలు మాత్రమే గెలుస్తుందన్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ అని చెప్పారు.
బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుందని వెల్లడించారు.
హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!