24 గంటలు.. 23 ఆపరేషన్లు వేములవాడ ఏరియా ఆసుపత్రి మరో రికార్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి( Vemulawada Government Regional Hospital )లో మెరుగైన సేవలు అందుతున్నాయి.

24 గంటల్లో 23 ఆపరేషన్లు చేసి దవాఖాన సత్తా చాటారు.కార్పొరేట్ కు దీటుగా ముందుకు సాగుతున్నారు.

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో గత 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో 23 వివిధ రకాల ఆపరేషన్లు అయ్యాయి.

  ఇందులో 10 డెలివరీలు,2 గర్భసంచి లో గడ్డ, 5 సాధారణ శస్త్ర చికిత్సలు, 1 కంటి ఆపరేషన్ మరియు 5 ఆర్తో ఆపరేషన్లు ఉన్నాయి.

సూపరింటెండెంట్ సీనియర్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య, గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, కంటి వైద్య నిపుణులు రత్నమాల, ఆర్థో డాక్టర్ అనిల్,మత్తు వైద్య నిపుణులు డా.

రాజశ్రీ, డా.తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సేవలు అందించిన వైద్యులను డాక్టర్ పెంచలయ్య అభినందించారు.ప్రభుత్వ విప్, కలెక్టర్ సహకారంతో.

వంద పడకల ఆసుపత్రి లో ప్రస్తుతం అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని సూపరింటెండెంట్ సీనియర్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ), కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సహకారంతో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

పోస్టు మార్టం సేవలు, స్కానింగ్ సేవలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.వేములవాడలో సదరం శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి వేములవాడ నియోజక వర్గంలో సదరం క్యాంపునకు దరఖాస్తు చేసుకున్న వారు ఆయా తేదీల్లో నిర్ణయించిన సమయానికి రావాలని డాక్టర్ పెంచలయ్య సూచించారు.

వైకల్య నిర్ధారణ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సావిత్రి బిల్డింగ్ వల్లే కలిసొచ్చింది.. దాన్ని ఎప్పటికీ అమ్మను: కిరణ్ గుండు