భారత సంతతి వ్యక్తి హత్య : హంతకుడికి తుపాకీ విక్రయం.. రెండేళ్ల నాటి కేసులో అమెరికన్ యువకుడికి జైలు శిక్ష

అమెరికాలో 2021 నాటి హత్య కేసుకు సంబంధించి ఓ యువకుడికి అక్కడి కోర్ట్ 18 నెలల శిక్ష విధించింది.

ఆపై 36 నెలల పర్యవేక్షణ వుంటుందని తెలిపింది.ఇతను సిక్కు కిరాణా వ్యాపారిని చంపడానికి దొంగిలించిన హ్యాండ్‌గన్‌ను ఓ యువకుడికి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఓగ్డెన్‌కు చెందిన టేడన్ టైలర్ లా( Taydon Tyler Law ) (22) తన దగ్గర వున్న రూగర్ ఎల్‌సీ9, 9ఎంఎం హ్యాండ్‌గన్‌ను ఆంటోనియో గియానీ గార్సియా( Antonio Gianni Garcia ) (అప్పటికి 15 ఏళ్లు)కు విక్రయించాడు.

దీని సాయంతో ఆంటోనియో ఫిబ్రవరి 28, 2021న సూపర్ గ్రోసరీలోకి ప్రవేశించి పంజాబ్‌కు చెందిన 65 ఏళ్ల సత్నామ్ సింగ్‌ను కాల్చి చంపాడు.

"""/" / ఈ నేరానికి సంబంధించి తుపాకీని కలిగివున్నందుకు గాను నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

దీనికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది.యూఎస్ అటార్నీ కార్యాలయం చెప్పినదాని ప్రకారం.

టేడన్ తను పనిచేస్తున్న ఇంటి నుంచి హ్యాండ్‌గన్, మందుగుండు సామాగ్రిని దొంగిలించాడు.ఉటా జిల్లాకు చెందిన అటార్నీ కార్యాలయం అక్రమంగా ఆయుధాలను కలిగి వున్న వ్యక్తులు, వాటిని బదిలీ చేసే కేసులను విచారిస్తుంది.

ఇలాంటి ఘటనలు తమ పౌరులను ప్రమాదంలో పడేస్తాయని అటార్నీ ట్రినా ఏ హిగ్గిన్స్( Attorney Trina A.

Higgins ) ఒక ప్రకటనలో తెలిపారు.టేడన్ నుంచి తుపాకీని కొన్న గార్సియా రెండు ఫస్ట్ డిగ్రీ నేరాలను అంగీకరించగా, దీనికి గాను ఐదేళ్లు.

యావజ్జీవ శిక్షలను ఇప్పటికే అనుభవిస్తున్నాడు. """/" / ఇకపోతే.

మృతుడు సత్నాం సింగ్( Satnam Singh ) భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వ్యక్తి.

1987లో ఆయన అమెరికాకు వలసవచ్చారు.ఈ క్రమంలో 2000లో సూపర్ గ్రోసరీని కొనుగోలు చేశాడు.

భార్య, ముగ్గురు కుమార్తెలో సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో గార్సియా చిచ్చు పెట్టాడు.

2021లో సూపర్ గ్రోసరీలో జరిగిన దోపిడీ, సత్నాం సింగ్ హత్య‌తో అతని కుటుంబం ఒంటరిదైంది.

ఘటన జరిగిన రోజున రాత్రి గార్సియా ఒంటరిగా దుకాణంలోకి వెళ్లి కొన్ని వస్తువులను తన కార్ట్‌లో వేసుకున్నాడు.

అనంతరం హ్యాండ్ గన్‌ని తీసి సత్నామ్ సింగ్‌పై కాల్పులు జరిపాడు.దీంతో ఆయన తీవ్ర గాయాలతో దుకాణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన అప్పట్లో అమెరికాలోని భారతీయ కమ్యూనిటీని ఉలిక్కిపడేలా చేసింది.

పోలీస్ ఆఫీసర్లను కారుతో తొక్కించాలనుకున్న పాకిస్థాన్ మహిళ.. వీడియో వైరల్..