గణపతిని పూజించే పూజలో ఉపయోగించే ఆకుల వల్ల కలిగే ఆరోగ్య రహస్యలు ఇవే..!

మన భారతదేశంలో వినాయక చవితి( Vinayaka Chaviti )ని ఎంతో పవిత్రమైన పండుగగా ప్రజలందరూ జరుపుకుంటారు.

ఎందుకంటే పార్వతీ, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు.

వినాయక చవితి రోజు గణేశుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.ఈ పత్రాలు ఆయుర్వేద ప్రకారం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

వాటిలో అతి ముఖ్యమైన ఆకుల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ ముఖ్యంగా చెప్పాలంటే బిల్వ పత్రాన్ని( Bilva Patra ) మారేడు ఆకు అని కూడా అంటారు.

ఇవి మూడు ఆకులుగా కలిసి ఒకే ఆకుగా ఉంటాయి.ఇవి శివునికి కూడా ఎంతో ఇష్టం.

అలాగే శ్రీ మహాలక్ష్మి దేవికి కూడా ఈ ఆకులు ఎంతో ఇష్టం.కీళ్ల సంబంధ వ్యాధులను, విరోచనాలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.శరీర దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.

అనేక ఔషధల తయారీలలో ఈ ఆకులను ఉపయోగిస్తారు.ఇంకా చెప్పాలంటే తులసి పత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది.

తులసి పత్రాలను దేవత అర్చనలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. """/"/ ఇది శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది.

అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కలను( Tulsi ) పెంచుకుంటూ, పూజిస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే వినాయకుడిని తులసి ఆకులతో పూజించకూడదు.అలాగే కరవీర పత్రాన్ని( Karaveera Patram ) గన్నేరు అని అంటారు.

వీటి పూలు తెలుగు, పసుపు, ఎరుపు రంగులలో ఉంటాయి.దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత ఇది ఒక మంచి స్కిన్ కేర్ ఔషధంగా పనిచేస్తుందనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.

"""/"/ అలాగే దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు( Devadaru ) అని చాలామందికి తెలుసు.

ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది.ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

వాంతులు, విరోచనాలను ఈ ఆకు అరికడుతుంది.శరీరంలో ఉన్న హానికరమైన క్రిములను ఇది నాశనం చేస్తుంది.

జాజి పత్రం మొక్క పువ్వుల నుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు.ఇది చర్మ రోగాలు, స్త్రీ సంబంధిత వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

అంతేకాకుండా ఇది అతిమూత్ర సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

తేజ సజ్జా మిరాయ్ మూవీ పరిస్థితి ఏంటి..?