వైరల్.. అక్కడ కట్నంగా పాములను ఇస్తారట.. ఎందుకంటే ?

మన దేశంలో కట్నాలు విరుద్ధం అయినప్పటికీ ఇప్పటికి వాటిని ఆచారంగా భావిస్తున్నారు.ఆడ పిల్లకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాల్సిందే.

కట్నం ఇస్తే గాని పెళ్లి కొడుకు వారు పెళ్ళికి ఒప్పుకోరు.కానీ పెళ్ళిళ్ళకు ఎవరైనా ఏమి కట్నం ఇస్తారు.

నగలు, ఆస్తులు అది లేదంటే వస్తువులను కానుకలుగా ఇస్తారు.కానీ ఇక్కడ పెళ్ళికి పాములను కట్నంగా ఇస్తారట.

ఒక తండ్రి కూడా తన కూతురు పెళ్లి చేయడం కోసం తన అల్లుడికి కట్నం ఇచ్చాడు.

కానీ అది నగలో, ఆస్తులో కాదు పాములను కట్నంగా ఇచ్చాడట.నిజమండి బాబు ఆ తండ్రి తన కూతురు పెళ్లి చేయడం కోసం కట్నం కింద 21 పాములను పెళ్లి కొడుకుకి కానుకగా ఇచ్చాడట.

అసలు పాములను ఎందుకు పెళ్ళికి కానుకగా ఇచ్చాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

"""/"/ మధ్యప్రదేశ్ లోని గోరియా తెగకు చెందిన ఆచారం ఇది.ఇక్కడ తెగ పెళ్ళికి పెళ్లి కొడుకుకి పాములను ఇవ్వడం ఆచారం అట.

ఇటీవల జరిగిన పెళ్ళిలో పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుకి కట్నం కింద 21 విష సర్పాలను బహుమతిగా ఇచ్చాడట.

ఆ పాములను వరుడు కట్నం కింద స్వీకరించాడట.ఇప్పుడు ఈ విషయం పై చర్చలు జరుగు తున్నాయి.

"""/"/ ఇలా పాములను ఇవ్వడం వాళ్ళ ఆచారం అట.ఎప్పటి నుండో వీళ్ళు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని వాళ్ళు చెబుతున్నారు.

ఇలా పాములను ఎందుకు ఇస్తున్నారంటే పెళ్లి పవిత్రతను పాములు కాపాడతాయని గోరియా తెగకు చెందిన వారు నమ్ముతున్నారు.

అంతేకాదు పాములు పట్టడమే వాళ్ళ వృత్తి.దానిమీదే ఇక్కడి ప్రజలు జీవిస్తున్నారు.

అందుకే యువతికి పెళ్లి చేయాలంటే ఇక్కడ కుటుంభం మొత్తం ముందుగానే పాములను పట్టుకునే పనినే పెట్టుకుంటారట.

ఈ విషయం తెలిసిన వారు పాపం ఆ వరుడు ఈ పాములను ఏం చేసుకుంటాడో అని చర్చించు కుంటున్నారు.

ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.. ఇప్పటి తరానికి తెలియని విషయాలు