వివి ప్యాట్ లెక్కింపుపై కోర్ట్ కి ఎక్కిన చంద్రబాబు! 21 పార్టీలని ఒప్పించాడు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జోరు కొనసాగుతుంది.ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తయిపోయింది.

ఇక ఈ ఎన్నికల లో అన్ని పార్టీలు తమ సత్తా చాటే ప్రయ్యత్నం చేస్తున్నాయి.

ఇక ఈవీఏంల పనితీరుపై ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా విమర్శలు చేస్తున్నాయి.పదేళ్ళుగా ఈవీఏంల ద్వారానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఎప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి వస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఏంల పనితీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తూ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంటూ అన్ని పార్టీలని ఏకం చేసే ప్రయత్నం మొదలెట్టారు.

ప్రాంతీయ పార్టీలనిని ఒప్పించిన చంద్రబాబు మొత్తం 21 ప్రాంతీయ పార్టీలు ఈవీఏం ల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో 50 శాతం వివిప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఎలక్షన్‌ కమిషన్‌ ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయించారు.

గతంలో 50 శాతం వివిప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలంటూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ప్రతి అసెంబ్లి నియోజక వర్గంలో 5 వివిప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించిన నేపధ్యంలో ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో రివ్యూ పిటిషన్ వేసిన ప్రాంతీయ పార్టీలకి న్యాయస్థానం ఎలాంటి తీర్పుతో సమాధానం చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా?