Sandeep Reddy Vanga : ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకులు వీళ్లే.. టాప్5 సినిమాల జాబితా ఇదేనంటూ?
TeluguStop.com
మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు హీరోల మధ్య అలాగే హీరోలు, అభిమానుల మధ్య పోటీ జరగడం అన్నది కామన్.
2023 లో మాత్రం డైరెక్టర్ల మధ్య పోటీ నడిచింది.నువ్వా నేనా అన్న విధంగా హోరా హోరిగా పోటీ నడిచింది.
2023లో డైనమెట్ లాంటి మూవీస్ తో బాక్సాఫీస్ ని దద్దరిల్లేలా చేశారు ఆ డైరెక్టర్స్.
నాలుగు సినిమాలు రెండు వేల కోట్ల వసూళ్లతో రికార్డ్ సృష్టించారు ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ మూవీతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేసిన ప్రశాంత్ నీల్ 2023లో సలార్ తో తన స్టామినా ఏంటో మరోసారి ఫ్రూవ్ చేశాడు.
ప్రభాస్ ని డైనోసార్ రేంజ్ లో చూపించి దడ పుట్టించాడు.బాక్సాఫీస్ ని షేక్ చేశాడు.
2023 హైయ్యెస్ట్ ఓపెనర్ నిలిచింది సలార్.రాజమౌళి తర్వాత నార్త్ లో మళ్లీ ఆ రేంజ్ లో సత్తా చాటిన సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రమే.
అందుకే స్టార్స్ అంతా ఇఫ్పుడు ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేస్తున్నారు.మొత్తానికి 2023 డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కి బాగా కలిసొచ్చింది.
అందుకే డిసెంబర్ లో సలార్ రిలీజ్ చేసి గ్రాండ్ గా 2023కి సెండ్ ఆఫ్ ఇచ్చారు.
"""/" /
ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఎప్పుడొచ్చినా సెన్సేషనే అని చెప్పవచ్చు.
2023లో యానిమల్ మూవీతో సందీప్ వంగా మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు.
హీరో రణబీర్ కపూర్ కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్‌తో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఏకంగా 800 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది.యానిమల్ హిట్ తో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేసిన కోలివుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి 2023 మాంచి కిక్కిచ్చింది అనే చెప్పాలి.
విజయ్ తో చేసిన బీస్ట్ మిశ్రమ స్పందన రావడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్నాడు.
మరో పక్క ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి జైలర్ మూవీతో అదిరిపోయే హిట్టిచ్చాడు నెల్సన్.
పర్ఫెక్ట్ స్ర్కీన్ ప్లే, పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ తో బొమ్మ అదుర్స్ అనిపించాడు. """/" /
మొన్నటిదాకా నార్త్ లో సత్తాచాటిన సౌత్ డైరెక్టర్సంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగా పేర్లే ఎక్కువగా వినిపించేవి.
కానీ 2023లో కోలివుడ్ డైరెక్టర్ అట్లీ కూడా లైన్ లోకి వచ్చాడు.భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్ ఖాన్ కి, జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చి కరువు తీర్చాడు.
వెయ్యి కోట్ల వసూళ్లతో జవాన్ ( Jawan )ఈ ఏడాది హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
తమిళ్ డైరెక్టర్ అట్లీకి 2023 కలిసొచ్చి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.
అంచనాలకి అందకుండా సినిమాలు తీసే మరో కోలివుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా నుంచి వరుస హిట్స్ కొడుతూ ప్రేక్షకులని మెప్పిస్తూ వెళ్తున్నాడు.
2022 లో విక్రమ్ మూవీతో కమల్ హాసన్ ని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చాడు.
2023లో కూడా లోకేష్ తన మార్క్ చూపించాడు.దళపతి విజయ్ తో లియో చేశాడు.
620 కోట్లకిపైగా కలెక్షన్స్ తో లియో విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.
నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?