దుమ్ముదులిపిన మహమ్మద్ సిరాజ్… అరుదైన ఘనత ఇదే!

ఈ మధ్య కాలంలో క్రికెట్ క్రీడా ప్రపంచంలో బాగా వినబడుతున్న పేరు మహమ్మద్ సిరాజ్.

అవును, గత కొన్ని సిరీస్ ల నుండి ఈ హైదరాబాద్ బౌలర్ టీమ్ ఇండియాలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు అనే విషయం విదితమే.

అయితే ఇలా వచ్చిన అవకాశాలను ఎంతమంది అందిపుచ్చుకుంటారు? కానీ సిరాజ్ మాత్రం తనదైన ప్రదర్శనతో ఆకట్టుకొని ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాడు అని సగర్వంగా చెప్పుకోవాలి.

ఫార్మాట్ తో సంబంధం లేకుండా తనదైన ఆటతీరుతో ఫినిష్ ఇస్తున్న మహమ్మద్ సిరాజ్ ఇక రానున్న రోజుల్లో తన స్థానాన్ని టీమిండియాలో సుస్థిరం చేసుకునేలాగే అవకాశాలు మెండుగా వున్నాయి.

సరిగ్గా రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ పర్యటనలో ఓ మెరుపు మెరిసిన సిరాజ్ ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనలో కూడా అదే జోరును కొనసాగించడం విశేషం.

బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతూ సిరాజ్ తన స్టైల్ బౌలింగ్ తో నిప్పులు చెరుగుతున్నాడు అని చెప్పాలి.

కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో సునాయాసంగా వేసుకుంటున్నాడు.

అయితే ఇటీవల వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు చివరికి సిరీస్ చేజార్చుకోవడం ఒకింత బాధాకరం.

"""/"/ ఇక అసలు విషయానికొస్తే, తాజాగా రెండో వన్డే మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు.

2022 ఏడాదిలో వన్డే ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా సిరాజ్ రికార్డులు నెలకొల్పాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో అనుముల్ హక్ ను అవుట్ చేయడం ఈ ఘనతకు నాంది పలికిందని చెప్పవచ్చు.

ఇక ఇప్పటివరకు ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో సిరాజ్ 23 వికెట్లను పడగొట్టాడు అని చెప్పాలి.

ఈ క్రమంలో అంతకుముందు భారత స్పిన్నర్ చాహాల్ పేరిట వున్న ఈ రికార్డుని మనోడు అధిగమించాడు.

వరుడు, లియో సినిమాలను విశాల్ రిజెక్ట్ చేయడానికి కారణాలివేనా.. ఏమైందంటే?