2022 ఫస్ట్ హాఫ్ రివ్యూ : ఫ్లాపులతో సతమతమవుతున్న వారికి.. ఈ ఏడాది సూపర్ హిట్ ఇచ్చిందే?

సినిమా ఇండస్ట్రీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న వారిని ఒక్క సినిమా మళ్ళీ ఊపిరి పోసి సక్సెస్ ట్రాక్లోకి తీసుకు వెళ్తు ఉంటుంది.

ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు దూసుకు పోతూ ఉంటారు.

అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఇలాంటి సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు అని తెలుస్తోంది.

ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleనాగార్జున, రమ్యకృష్ణ, కళ్యాణ్ కృష్ణ /h3p: గత కొంతకాలం నుంచి నాగార్జున సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు.

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ కి కూడా సరైన సక్సెస్ లభించలేదు.ఇక సోగ్గాడే చిన్నినాయన తర్వాత దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సైతం పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ కొట్టలేకపోయాడు.

కానీ ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు సినిమా మాత్రం ఈ ముగ్గురు కెరీర్కి పెద్ద రిలీఫ్ ఇచ్చింది అని చెప్పాలి.

H3 Class=subheader-styleరానా - నిత్యామీనన్ /h3p: నేనే రాజు నేనే మంత్రి తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయాడు రానా.

ఎన్ని సినిమాల్లో నటించిన ఫలితం లేకుండా పోయింది.నిత్యామీనన్ సైతం ఎన్టీఆర్ తో నటించిన జనతా గ్యారేజ్ తర్వాత ఒక్క హిట్ ఖాతాలో వేసుకోలేక పోయింది.

కానీ ఇద్దరు నటించిన భీమ్లా నాయక్ సినిమా విజయం సాధించడం మాత్రం వీరి కెరియర్కు ఎంతో ఉపయోగపడింది అని చెప్పాలి.

"""/" / H3 Class=subheader-styleరామ్ చరణ్ :/h3p వినయ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ తో కెరియర్ లో కాస్త వెనుకబడిపోయిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తో మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాడు.

పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు. """/" / H3 Class=subheader-styleకీర్తి సురేష్ :/h3p మహానటి సినిమా తర్వాత సరైన హిట్ లేక కీర్తి సురేష్ ఎంతగానో ఇబ్బందులు పడింది.

ఇక కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు.ఆ సమయంలోనే మహేష్ సరసన నటించి సర్కారు వారి పాట సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

వీళ్ళు మాత్రమే కాకుండా గని తో ఫ్లాప్ చూసిన వరుణ్ తేజ్ ఎఫ్ 3 తో మళ్లీ సక్సెస్ కొట్టాడు.

ఇక తమన్నా మెహరీన్ సోనాల్ చౌహాన్ సైతం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఎఫ్ త్రీ సినిమా ఊరటనిచ్చింది.

ఇక పుష్ప ది రైస్ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ కూడా ట్రాక్ లోకి వచ్చినట్లే కనిపించాడు.

ఫరియా అబ్దుల్లా టాటూ వెనుక సీక్రెట్ ఇదేనా.. ఆ టాటూ వెనుక ఇంత అర్థం ఉందా?