ఈ ఏడాదికి మంచి ఊపుతో గుడ్ బై చెప్పిన సినిమాలేంటో తెలుసా.?

కరోనా దెబ్బకు తెలుగు సినిమా పరిశ్రమ అల్లకల్లోలం అయ్యింది.మహమ్మారి వచ్చిన దగ్గరి నుంచి సినిమా రంగానికి చాలా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది సగానికిపైగా రోజులు సినిమా థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నెమ్మదిగా తెరుచుకున్న హాళ్లకు ఏపీ సర్కారు మరో షాక్ ఇచ్చింది.టిక్కెట్ల రేట్లు అమాంతం తగ్గించింది.

ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.థియేటర్లలో అమ్మే పాప్ కార్న్ కంటే టికెట్ ధర తగ్గడంతో సినీ నిర్మాతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

కరోనా కాలంలో కొన్ని థియేటర్లు మూతపడగా.టిక్కెట్ల రేట్లు తగ్గడంతో మరికొన్ని థియేటర్లు క్లోజ్ అయ్యాయి.

ఏపీ సర్కారు నిబంధనల కంటే థియేటర్లు మూసుకోవడమే మంచిదని భావిస్తున్నారు హాళ్ల యాజమాన్యాలు.

నష్టాలతో నడపడం కంటే క్లోజ్ చేయడమే మంచిదని భావిస్తున్నారు.కరోనా కష్టాలు, సర్కారు తీరు మూలంగా సినిమా పరిశ్రమ కష్టాల కడలిలో కొనసాగుతుంది.

మొత్తంగా ఈ కష్ట సమయంలోనూ డిసెంబర్ నెల కాస్త సినిమా రంగానికి ఊపునిచ్చింది.

ఈ నెలలో విడుదలైన పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.డబ్బులు కూడా బాగానే రాబట్టాయి.

"""/" / ఈ నెలలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ.బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ కు మంచి కిక్ ఇచ్చింది.

హౌస్ ఫుల్ కలెక్షన్లతో సత్తా చాటింది.ఈ ఏడాది సినిమా రికార్డులను తిరుగ రాసింది.

అటు ఓవర్సీస్ లోనూ మంచి రాబడి సాధించింది.అటు ఈ సినిమా తర్వాత వచ్చిన పుష్ప కూడా మంచి విజయాన్ని అందుకుంది.

"""/" / వసూళ్ల వర్షాన్ని కురిపించింది.జనాలకు ఈ సినిమా కూడా మంచి వినోదాన్ని అందజేసింది.

అటు చివరలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

బాగానే వసూళ్లు చేపడుతుంది.ఈ మూడు సినిమాలు టాలీవుడ్ లో మంచి ఊపు తెచ్చాయి.

ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికాయి.

Sharwanand : శర్వానంద్ సినిమాకు బాలయ్య హిట్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?