సందడే సందడి ! మూడు పార్టీల్లోనూ ..ఇదే తంతు

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు రాజకీయ పార్టీలకు ఎక్కడ లేని కంగారు మొదలయిపోతుంది.

ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే.సొంత పార్టీలో వారికి టికెట్ల కేటాయింపు చేయడం కత్తి మీద సాముగా ఆయా పార్టీలు ఫీల్ అవుతుంటాయి.

ఈ విషయంలో ప్రతి పార్టీ చాలా ఇబ్బందే పడుతూ ఉంటాయి.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి మొదలు కావడంతో రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపులో తలమునకలై ఉన్నాయి.

ఏ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.

అనేక సర్వేలు చేయించుకుంటూ.గెలుపు గుర్రాలను గుర్తించి వారికి టికెట్ కేటాయించే పనిలో బిజీ అయ్యాయి.

175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా తయారు చేసేపనిలో రాజకీయ పార్టీలు బిజీ అయ్యాయి.

అధికార పార్టీ టిడిపి విషయానికి వస్తే.టికెట్ల విషయంలో ఇక్కడ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా.వచ్చే ఎన్నికల్లో తమకు సీటు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తుండగా.

కాదు సీటు తమదంటే తమదని పోటీలు పడి మరీ అధినేత వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం మరికొందరు చేస్తున్నారు.

చాలా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఆ తర్వాత నియోజకవర్గ ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ఐదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాను కనుక మరోసారి తమకు అవకాశం కల్పించాలని వీరంతా అధినాయకుడిని వేడుకుంటున్నారు.

ఇక వైఎస్సార్ పార్టీ విషయానికొస్తే ప్రస్తుతం ఏపీ లో ఫ్యాన్ గాలి పెరిగినట్టుగా కనిపిస్తుండడంతో .

ఆ పార్టీలో జోష్ నింపడమే కాకుండా ఇతర పార్టీల నుంచి అనేక మంది నాయకులు వైసీపీ లోకి వచ్చి చేరుతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ టిక్కెట్లు విషయంలో జనసేన, టిడిపి, కాంగ్రెస్, బిజెపి అన్ని పార్టీలతో పోల్చుకుంటే వైసీపీలోనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది.

ఇక కొత్తగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న జనసేన పార్టీలో ఆశించిన స్థాయిలో ఉత్సాహం కనిపించడం లేదు.

ఈ పార్టీలోకి వచ్చి చేరే నాయకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది.ముఖ్యంగా జనసేన క్లీన్ స్వీప్ చేస్తామని ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాల్లో ఆ హడావుడి కనిపించడం లేదు.

కొద్ది రోజుల క్రితం రాజమండ్రి బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన లో చేరగా.

మళ్ళీ ఆ తర్వాత ఆ స్థాయి నాయకులు వచ్చి చేరలేదు.దీంతో జనసేనలో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది.

ఇవన్నీ ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న వారే తప్ప .

బలమైన ప్రత్యర్థులైన టిడిపి వైసిపి పార్టీలు ఎదిరించే సత్తా ఉన్న వారు కనిపించకపోవడంతో ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంలో సందేహాలు తీరడంలేదు.

నెట్టింట్లో పూనమ్ మంటలు.. ఏపీ యూపీ అయ్యిందంటూ?