2019 సంక్రాంతి పోటీ పుంజు ఖరారు
TeluguStop.com
తెలుగు వారికి సంక్రాంతి పండుగ చాలా కీలకం.ప్రతి సంక్రాంతికి కూడా భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతాయి.
సంక్రాంతికి వచ్చే సినిమాలు మంచి కలెక్షన్స్‌ను సాధిస్తాయని, ఎక్కువగా విజయాలను అందుకుంటాయని సినిమా పరిశ్రమ నమ్మకం.
అందుకే ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు కనీసం రెండు మూడు అయినా ఉంటాయి.
2017 సంక్రాంతికి మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇంకా శర్వానంద్ ‘శతమానంభవతి’ చిత్రాన్ని విడుదల అయ్యాయి.
ఆ మూడు సినిమాలు కూడా సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
2017 సంక్రాంతి సూపర్ హిట్స్‌తో పోరులో నిలిచిన మూడు పందెం కోళ్లు కూడా గెలుపొందాయి.
ఇక 2018లో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ మరియు బాలకృష్ణ ‘జైసింహా’ చిత్రాలు విడుదల అయ్యాయి.
ఆ రెండు చిత్రాలతో పాటు రాజ్ తరుణ్ నటించిన ‘రంగులరాట్నం’ కూడా విడుదల అయ్యింది.
సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
ఈ మూడు సినిమాలు సంక్రాంతి సీజన్‌ను పూర్తిగా వృదా చేశాయి.బరిలో నిలిచిన మూడు కోళ్లు కూడా ఓటమి చెందాయి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
సంక్రాంతి ఆరు నెలలు ఉండగానే బరిలో నిలిచే సినిమాలు ఖరారు అవుతాయి.
తాజాగా 2019 సంక్రాంతి పోటీకి రంగం సిద్దం అయ్యింది.2017లో మెగాస్టార్ మరియు బాలకృష్ణలు పోటీ పడ్డారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వారిద్దరు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’తో సంక్రాంతికి రాబోతున్నట్లుగా ఎప్పుడో ప్రకటన వచ్చింది.
ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అందుకే చాలా జాగ్రత్తగా, ఎక్కువ రోజులు తీసుకుని సినిమాను చేస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం సంక్రాంతికి విడుదల నూరు శాతం కన్ఫర్మ్ అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
ఈ రెండు చిత్రాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్దం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2019 సంక్రాంతి అయిన సక్సెస్‌తో బాక్సాఫీస్ కళకళలాడేనో చూడాలి.
చరణ్ కొత్త సినిమా కోసం అలాంటి ప్రయోగం.. బుచ్చిబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?