2018 మూవీ హీరోయిన్ కి టాలీవుడ్ కి అలాంటి సంబంధం ఉందా.. అదేంటో తెలుసా?

తాజాగా విడుదలైన 2018 సినిమా( 2018 Movie ) ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపించింది.

2018లో కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్( Director Jude Anthony Joseph ) చక్కగా తెరకెక్కించారు.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లపై రాబట్టి కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత బన్నీవాస్ జీఏ2 పిక్చర్స్( Bunnywas GA2 Pictures ) బ్యానర్‌పై విడుదల చేసిన తెలిసిందే.

తెలుగులో కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ ల వర్షం కురిపించింది.

ఈ మూవీ కలెక్షన్ లు చూసి థియేటర్ లో చాలా రోజులు ఆడుతుంది అని చాలా మంది భావించారు.

కానీ అంతలోనే ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ కొనుగోలు చేసింది.

థియేటర్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్ లతో కొనసాగుతుండగానే ఈ నెల 6 నుండి ఓటీటీ లోకి వచ్చేసింది.

మలయాళం, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ప్రసారం అవుతోంది.

"""/" / కాగా ఈ చిత్రంలో అనూప్( Anup ) అనే క్యారెక్టర్‌లో కనిపించారు మలయాళ నటుడు టోవినో థామస్( Tovino Thomas ).

హీరోయిన్ గా తన్వీరామ్( Tanveeram ) నటించింది.అలాగే కుంచికో బొబన్, అపర్ణా బాల మురళి, లాల్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ తదితరులు కీలకపాత్రలో నటించారు.

అయితే ఇందులో రెండు లవ్ స్టోరీలు ఉన్నా టోవినో థామస్, తన్వీరామ్ ప్రేమ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

చివరకు వీరి ప్రేమ కథ విషాదంతం అవుతుంది.తన్వీ రామ్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.కాగా ఆమె అసలు పేరు శృతి రామ్.

"""/" / ఈ కేరళ కుట్టి 2012 మిస్ కేరళ ఫైనలిస్ట్ లో ఒకరిగా కూడా నిలిచింది.

ఇక 2019లో అంబిలీ( Ambily ) అనే సినిమా ద్వారా మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అలా అతి తక్కువ సమయంలోనే 10 సినిమాలలో నటించింది.కాగా తన్వీ రామ్ కి టాలీవుడ్‌ తో కూడా సంబంధం ఉంది.

అదేమిటంటే ఈ మలయాళ కుట్టీ తెలుగులో ఒక సినిమా చేసింది.అదే మన నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాలో నటించింది.

అందులో నాని వదిన పాత్ర అనగా హీరోయిన్ నజ్రియా అక్క పాత్రలో ఆమె మెరిసింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది తన్వీ రామ్.నజ్రియా అక్క పాత్ర పుష్ప క్యారెక్టర్ లో నటించింది.

ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంటుంది.కానీ బిడ్డ చనిపోవడంతో బాధపడుతుంది.

దీంతో తండ్రి చిన్న కూతురైన లీలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసేందుకు వెనకాడతాడు.

అలా ఆ సినిమాకు ఆమెనే కీ రోల్ అయ్యింది.

ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆఫీసు గుమ్మానికే చేతబడి.. కలకలం రేపుతున్న క్షుద్రపూజల సామాగ్రి..