ఓటీటీ లో వచ్చినా అక్కడ జోరు మాత్రం ఆగలేదు.. ఇలా ఎప్పుడు జరగలేదు!

కరోనా తర్వాత సినిమాల వసూళ్ల విషయం గురించి మాట్లాడుకోవడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి ఉంది.

కొన్ని సినిమా లు హిట్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు సొంతం చేసుకోలేక పోతున్నాయి.

దాంతో చాలా సినిమా లు ఓటీటీ ( OTT )లో వెంటనే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

కానీ కొన్ని సినిమా లు మాత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్‌( OTT Streaming ) అయిన తర్వాత కూడా వసూళ్లు సాధిస్తూనే ఉంది.

ఆ కలెక్షన్స్ చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగక మానదు.ఆ మధ్య మన బలగం సినిమా ఏ స్థాయి లో వసూళ్లు సాధించిందో మనం అంతా చూశాం.

ఓటీటీ లో విడుదల అయిన వెంటనే థియేటర్ల నుండి సినిమా ను తొలగించలేదు.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సమంయలో కూడా థియేటర్ల నుండి సాలిడ్ షేర్ వచ్చింది.

"""/" / ఇప్పుడు అదే పరిస్థితి '2018' సినిమా( 2018 Movie ) చవి చూసింది.

ఓటీటీ లో విడుదల అయిన సమయం కు ఈ సినిమా థియేట్రికల్ రన్ లో రూ.

170 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.ఓటీటీ స్ట్రీమింగ్ చేసి ఉండకుంటే రెండు వందల కోట్ల క్లబ్‌ లో చేరేది అంటూ కొందరు సినీ ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా థియేటర్ లో నడిచింది.

థియేట్రికల్‌ రన్‌ లో ఈ సినిమా జోరు కంటిన్యూ అవ్వడంతో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్స్( 2018 Movie Good Collections ) నమోదు అయ్యి ఏకంగా రూ.

200 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ క్లబ్‌ లో ఉన్న అతి తక్కువ మలయాళ సినిమాల జాబితాలో చిన్న సినిమా అయిన 2018 చేరింది.

అయిదు కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా కు ఆ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం ప్రపంచ రికార్డ్‌ అంటూ మలయాళ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ఎంత చెప్పుకున్నా తక్కువే.