పొలిటికల్ డిమాండ్ : రెండు వేల నోట్ల కోసం నాయకుల పాట్లు

ఏపీలో ఎన్నికల సీజన్ స్టార్ట్ అవ్వడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీఅభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం తదితర అంశాలన్నిటిలోనూ బిజీ బిజీ అయ్యాయి.

ఇక ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన అంశం ఓట్ల కొనుగోలు.ఏ పార్టీ అభ్యర్థి ఎక్కువ డబ్బు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థికే తమ ఓటు అంటూ ఓటర్ల మనోగతం ఉండడంతో భారీగా డబ్బులు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి.

ప్రస్తుతం ఓటర్ల డిమాండ్ బాగా పెరిగింది.ఐదు వందలు, వెయ్యి అంటే ఓటర్లు ఇంతేనా అనే పరిస్థితి అందుకే ఓటుకు రెండు వేలు చప్పున పంచేందుకు ప్రధాన పార్టీలు ఫిక్స్ అయిపోయాయి.

అందుకే ఒక వారం నుంచి రెండువేల నోటుకి ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది.మార్కెట్లో అన్ని నోట్లు కనిపిస్తున్నాయి కానీ రెండువేల నోట్లు మాత్రం అరుదుగా కనిపిస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఏపీలో ముక్కోణపు పోటీ తీవ్రతరం అయినా నియోజకవర్గాలలో ప్రధాన పోటీ అంతా తెలుగుదేశం, వైసీపీల మధ్య హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది.

అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో సామ, దాన, భేద, దండోపాయాలకు రాజకీయపక్షాలు పదునుపెడుతున్నాయి.

ఆర్ధిక, అంగబలాలను అన్నిరకాలుగా ఉపయోగించేసుకుంటున్నారు.ఈ సంగతి పక్కనపెడితే రెండువేల రూపాయల నోటుకు డిమాండ్ పెరగడంతో అసలు ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది అనే ప్రశ్న తలెత్తింది.

ఒక్కోక్క కారణాన్ని వెతుక్కుంటూ వెళితే అసలు సంగతి బయటకి వచ్చింది.ఎన్నికలు సమీపించిన తరుణంలో రాజకీయపార్టీల నేతలందరూ రెండువేల నోట్లను స్టాక్ పెట్టుకునే పనిలోపడ్డారట.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఏపీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు రెండువేల రూపాయల నోట్లకోసం ఎగబడుతున్నారు.

బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు, డబ్బులున్న బడా బాబులను బతిమిలాడుకుని మరీ పెద్ద నోట్లను మార్చుకుంటున్నారు.

దీనికోసం ఇప్పటికే అభ్యర్ధులు డబ్బును సమకూర్చుకుంటున్నారు.ఓటర్లు అయిదు వందలు, వెయ్యి, 15 వందలు ఆఫర్‌చేస్తే తీసుకునే పరిస్థితి కనిపించడంలేదట.

ఓటు ధర ఈసారి రెండువేల నుంచి అయిదువేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అందుకే ముందుగా రెండు వేల నోట్లను స్టాక్ పెట్టుకుంటున్నారు.ఇప్పటికే పంచాల్సిన సొమ్ములను తమ కీలక అనుచరుల దగ్గర భద్రంగా ఉంచేశారు.

పోలింగ్ ముందు రోజు వాటిని పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు చూస్తున్నారు.