బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత
TeluguStop.com
తాజాగా బద్రోడ్‌లో జరిగిన అండర్-23 స్టేట్ A ట్రోఫీ( Under-23 State A Trophy ) మ్యాచ్‌లో, ఉత్తరప్రదేశ్ తరఫున క్రికెట్ ఆడుతున్న సమీర్ రిజ్వీ,( Sameer Rizvi ) బంగ్లాదేశ్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని మించిన అద్భుత ప్రదర్శనతో 97 బంతుల్లో నాబాడ్ 201 పరుగులు సాధించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 20 సిక్సులు బాదాడు.సమీర్ రిజ్వీ 23వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు 405 పరుగుల భారీ స్కోరుకి తీసుకెళ్లాడు.
లిస్ట్ A క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించే రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ చాడ్ బోవస్( Chad Bowes ) పేరు మీద ఉండేది.
ఆయన 107 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించారు.సమీర్ రిజ్వీ ఈ రికార్డును 97 బంతుల్లో సృష్టించి కొత్త రికార్డు స్థాపించారు.
"""/" /
ఇక లిస్ట్ A క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డుల లిస్ట్ లో ఇప్పుడు సమీర్ రిజ్వీ 97 బంతులలో సాధించగా.
ఆ తర్వాత న్యూజిలాండ్ కు చెందిన చాడ్ బోవస్ 107 బంతులలో, భారతదేశానికే చెందిన నారాయణ్ జగదీశన్( Narayan Jagadeesan ) 114 బంతులలో, ఆస్ట్రేలియా బ్యాటర్స్ లో ట్రావిస్ హెడ్స్ 114 బంతులలో ఈ రికార్డ్ లో తర్వాతి స్థానాలలో ఉన్నారు.
ఇకపోతే, ఐపీఎల్ 2025లో( IPL 2025 ) సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) 95 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
గత ఐపీఎల్ 2024లో సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.8.
4 కోట్లకు కొనుగోలు చేసింది.2024 సీజన్‌లో సమీర్ 118.
60 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు మాత్రమే చేసాడు. """/" /
అండర్-23 ట్రోఫీ కోసం వరుసగా మూడు మ్యాచ్‌లలో సమీర్ రిజ్వీ తన సెంచరీలు సాధించారు.
పుదుచ్చేరి జట్టుతో 69 బంతుల్లో నాబాడ్ 137 పరుగులు, హిమాచల్ ప్రదేశ్ జట్టుతో 114 బంతుల్లో 153 పరుగులు, ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టుకు 97 బంతుల్లో 201 పరుగులు సాధించారు.
అయితే, ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.సమీర్ మంచి ప్రదర్శన ఇస్తున్న, ఆయనను విజయ్ హజారే ట్రోఫీ కోసం ఉత్తరప్రదేశ్ జట్టులో ఎంపిక చేయలేదు.
దీంతో, సమీర్ రిజ్వీ గురించి ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం భావన ఏంటో అనేది ప్రశ్నకు తెరతీసింది.
వీడియో: బైక్ నంబర్‌ప్లేట్ దాచాలనుకున్న బ్రో.. S24 అల్ట్రా జూమ్‌తో కనిపెట్టేసిన పోలీస్..