బీజేవైఎంలో 20 మంది సింగారం యువకుల చేరిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి దాదాపు 20 మంది యువకులు శనివారం భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో చేరడం జరిగింది.

బీజేవైఎం మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో యువమోర్చా లో చేరిన యువత.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువ మోర్చా లోకి యువకులను స్వాగతిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్లకి అన్నివేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు పరిష్కరించే విధంగా ఉండలని అన్నారు.

మరి అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న యువకులు రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించే గొంతుకలై ప్రతి ఒక్క సమస్య పై అధికార పార్టీ నాయకులను నిలదీయాలని, కెసిఆర్ నియంత పాలన వల్ల చాలామంది యువకులు ఉద్యోగాలు లేక ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, గల్ఫ్ దేశంలో గల్ఫ్ ఏజెంట్ ల మోసాలకు బలైపోతున్నారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు,యువకుల పాత్ర కీలకమైనది అన్నారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను నిండ ముంచిన కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.

బీజేవైఎం మండల ఉపాధ్యక్షులుగా సింగారం గ్రామానికి చెందిన కంచర్ల రోహిత్ ను నియమిస్తున్నట్లు బీజేవైఎం మండల అధ్యక్షుడు మెరుగు జితేందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువమోర్చా ఉపాధ్యక్షులు మార్పు దయాకర్ రెడ్డి, సనత్ రెడ్డి, సింగారం బూత్ అధ్యక్షులు దిలీప్, మధు, ప్రవీణ్ జాషువా, అభిలాష్, సందీప్, లోహిత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందా..?