విషాదం: వీసా స్టాపింగ్ కి అని వస్తే, బిడ్డ ప్రాణాలు పోయాయి

అమెరికా వీసా దొరికింది అన్న ఆనందం వారి కుటుంబంలో ఎక్కువసేపు నిలవలేదు.వీసా స్టాంపింగ్ కోసం అని హైదరాబాద్ వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

చిరు చిరు మాటలతో,అల్లరితో ఇంటిలో ఆనందాలు నింపే రెండేళ్ల పసివాడు ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముఠాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏటుకూరి రవినారాయణ కుటుంబం బెంగుళూరులో నివాసముండేవారు.

బెంగుళూరులోని ఇమేజిన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీలో జాబ్ చేసే రవినారాయణకు అమెరికాలో జాబ్ వచ్చింది.

కంపెనీ తరపున అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.వీసా స్టాంపింగ్ కోసం భార్యా, పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు.

ఈ క్రమంలోనే బేగంపేట్ లోని మానస సరోవర్ హోటల్ లో బస చేశారు.

అయితే రోటీ,పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసి వారంతా తిన్నారు.అయితే అది తిన్న కొద్దీ సేపటికే వారికి కడుపునొప్పి వాంతులు మొదలవ్వడం తో వెంటనే అప్రమత్తమైన రవినారాయణ తన కుమారులు అయిన వరుణ్,విహాన్ ,అలానే ఆయన భార్య శ్రీవిద్య ను కూడా తీసుకొని బేగం పేట్ లోని ఒక ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల విహాన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.

అయితే వారి విషయం లో మాత్రం హోటల్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని,ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే తమకేం పట్టనట్టు వ్యవహరించారని.

చికిత్స కోసం కనీసం ఆసుపత్రికి పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారు వాపోతున్నారు.ఇక, బాలుడు విహాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు.

బాలుడి మృతికి కారణాలేంటనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

ఈ సినిమాలు ఎక్కడున్నాయో తీసిన వారికి కూడా తెలుసో? తెలియదో ?