దొంగతనం కేసులలో నిందుతునికి 2 సంవత్సరంల జైలు శిక్ష..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :రెండు దొంగతనం కేసులలో ఒక కేసులో నిందుతునికి 2 సంవత్సరంల జైలు శిక్ష, 2000/- రూపాయల జరిమానా, ఇంకో కేసులో 02 నెలల జైలు శిక్ష 1000/- రూపాయలు జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమశ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి సోమవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీర ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు పట్టణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు గుర్రవానిపల్లి గ్రామంలోకి చెందిన మేకల లక్ష్మి అనే మహిళ, నిజామాబాద్ కు చెందిన చెవుల సంపూర్ణ అనే ఆమెది బంగారు పుస్తెల తాళ్లు దొంగతనంనకు పాల్పడిన వడ్డేపల్లి @ ఎరుకల సత్యం, గ్రామం ఊటూరు మానకొండూరు మండలo తేది.
26-03-2018 రోజున
రెండు కేసులలో వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.
విచారణ అనంతరం విచారణ అధికారి ప్రవీణ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు కానిస్టేబుల్ సురేష్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరుపున పి .విక్రాంత్ కేసు వాదిoచగా పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరస్తులకు ఒక కేసులో 2 సంవత్సరంల కారాగార జైలు శిక్ష మరియు 2000/-, రెండవ కేసులో 2నెలల కారాగార జైలు శిక్షతో పాటు 1000/- రూపాయలు జరిమానా విదించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.
నాని రెండు సినిమాలతో హిట్ కొడతాడా..?