సింగపూర్: కట్నం తిరిగివ్వాలంటూ.. భారత సంతతి పోలీస్ అధికారిపై ఇద్దరు భార్యల పోరాటం

కట్న కానుకలు, డబ్బు, నగలు, ఆస్తి కోసం పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లలను మోసం చేసే కిలాడీలకు సంబంధించిన వార్తలు తరచూ మనం వార్తల్లో చూస్తూనే వుంటాం.

ఇలాంటి వారు మనదేశంలో వీధికొకరు.అయితే పరాయి గడ్డ మీదకు వెళ్లాక కూడా బుద్ది మార్చుకోని వారి వల్ల భారతదేశ పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయి.

తాజాగా సింగపూర్‌లో ఇలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది.భారత సంతతికి చెందిన ఒక పోలీసు అధికారి ఇద్దరు మహిళలను పెళ్లాడాడు.

వివాహ సమయంలో వేలాది డాలర్లను కట్నం కింద తీసుకున్నాడు.అయితే వీరిద్దరికి విడాకులు ఇచ్చినప్పటికీ.

నగదు, విలువైన వస్తువులు మాత్రం తిరిగి ఇవ్వలేదన్న ఆరోపణలపై కోర్టులో విచారణ జరుగుతోంది.

సింగపూర్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్‌పీ)గా పనిచేస్తున్న మహ్మద్ రఫీక్ అబ్ధుల్ ఖాదర్ ఈ ఆరోపణలను ఖండించారు.

తన మాజీ భార్యలు, వారి కుటుంబాలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని చూస్తున్నారని పేర్కొన్నాడు.

దీనికి సంబంధించి ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక గురువారం కథనాన్ని ప్రచురించింది.మరోవైపు ఈ కేసు దర్యాప్తులో ఖాదర్ సహకరిస్తున్నాడని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

ఖాదర్ 2014లో భారత పౌరురాలైన తస్లేమాను వివాహం చేసుకున్నాడు.ఆ సమయంలో 8,900 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.

5,00,000 ) విలువ చేసే బంగారం, వాచ్‌ను కట్నంగా పొందినట్లు తమిళనాడుకు చెందిన స్థానిక వార్తా సంస్థ నివేదించింది.

అయితే పెళ్లయిన కొన్నిరోజులకే ఖాదర్ .తస్లేమాను భారత్‌కు తిరిగి పంపించాడని ఆ పత్రిక పేర్కొంది.

ఆ తర్వాత కట్నం తిరిగి ఇవ్వకుండానే విడాకుల కోసం దరఖాస్తు చేశాడని స్పష్టం చేసింది.

అయితే ఖాదర్ మాత్రం.తాము 2016లో సింగపూర్‌లో పెళ్లి చేసుకున్నామని.

2017లో విడాకులు తీసుకున్నామని చెబుతున్నాడు.విడాకులు మంజూరైన తర్వాత తస్లేమా కట్నాన్ని తిరిగి తీసుకుని భారత్‌కు వెళ్లిపోయిందని.

ప్రస్తుతం ఆమె మరో వివాహం చేసుకుని సంతోషంగానే వుందన్నారు.అయితే మీడియా సంస్థల కథనం ప్రకారం.

ఖాదర్.అమీర్ నిషా అనే భారతీయ పౌరురాలిని 2020లో రెండవ వివాహం చేసుకున్నాడు.

ఈ సమయంలో అతను 5,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో 2,81,765) విలువ చేసే ఆభరణాలు, రోలెక్స్ వాచ్, ఒక ప్లాటినం రింగ్, నగదును కట్నం కింద తీసుకున్నాడు.

"""/"/ వివాహమైన కొద్దిసేపటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని.కట్నం కూడా తిరిగి ఇవ్వలేదని రెండో భార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే దీనిని కూడా ఖాదర్ ఖండించారు.తాను 2021లో విడాకుల కోసం దరఖాస్తు చేశానని.

ఈ ఏడాది ప్రారంభంలోనే కోర్టు విడాకులు మంజురు చేసిందని చెప్పారు.తన రెండు పెళ్లిళ్లు కూడా సింగపూర్‌లో రిజిస్టర్ అయినట్లు ఖాదర్ వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025