కెనడా : రిపుదమన్ మాలిక్ హత్య కేసు .. నేరాన్ని అంగీకరించిన నిందితులు
TeluguStop.com
1985లో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిరిండియా కనిష్క( Air India Kanishka ) విమానాన్ని పేల్చివేసిన ఘటనలో నిందితుడు రిపుదమన్ సింగ్ మాలిక్‌ను( Ripudaman Singh Malik ) హత్య చేసిన ఇద్దరు హంతకులు సోమవారం కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం .బ్రిటీష్ కొలంబియాలోని( British Columbia ) న్యూ వెస్ట్ మినిస్టర్‌లోని కోర్టు హంతకులు టాన్నర్ ఫాక్స్ ,( Tanner Fox ) జోస్ లోపెజ్( Jose Lopez ) ఈ మేరకు నేరాన్ని అంగీకరించారు.
"""/" /
అక్టోబర్ 31న ఫాక్స్, లోపెజ్‌లకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది.
హంతకులను కోర్టు ముందు నిలబెట్టడం పట్ల మాలిక్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపినట్లుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
మాలిక్ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులకు శిక్ష పడినప్పుడే బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లని సన్నిహితులు పేర్కొన్నారు.
ఇప్పటికీ రిపుదమన్ మాలిక్ హత్య వెనుక గల కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి.కెనడాలో గురుగ్రంథ్ సాహిబ్ కాపీలను ముద్రించడంపై ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో( Hardeep Singh Nijjar ) మాలిక్‌కు వైరం ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఆయన హత్య తర్వాత ఏడాదికే సర్రేలో నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.ఈ రెండు హత్యల వెనుక ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
"""/" /
కాగా.1985 జూన్ 23న ఎయిరిండియా విమానం 182లో (కనిష్క) అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయి 329 మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అనుమానితుడిగా వున్న రిపుదమన్ సింగ్ మాలిక్ 2022 జూలై 14న కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు.
వాంకోవర్ సమీపంలో గుర్తు తెలియని ముష్కరులు మాలిక్‌పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
1985లో కనిష్క విమాన ప్రమాదం సంభవించిన సమయంలో భారత్, కెనడాలలో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రంగా వుంది.
ఈ ఘోర దుర్ఘటన వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ బబ్బర్ ఖల్సా వున్నట్లుగా అనేక అనుమానాలు, కథనాలు వచ్చాయి.
అయితే ఈ ఘటనలో మాలిక్ ను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకొన్నాయి.2005లో నిర్దోషిగా ప్రకటించబడిన తర్వాత .
ఆయన పేరును కెనడా ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించింది.
మోనాలిసా భారతీయ మహిళ అయితే ఎలా ఉంటుందో చూశారా.. ఇమేజ్ ఇదిగో!