యూకే : హిందూ ఆలయం వెలుపల వ్యక్తి దారుణ హత్య.. దోషులుగా తేలిన ఇద్దరు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హిందూ దేవాలయం వెలుపల ఒకరిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన కేసులో ఇద్దరు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

2022 ఆగస్ట్ 30న కీల్ డ్రైవ్‌లోని టెంపుల్ కార్ పార్కింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

నాటి ఘటనలో స్లోఫ్‌కు చెందిన మహమ్మాద్ రఫాకిత్ కయానీ (24) తీవ్రగాయాల పాలై.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటీష్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

ఈ కేసుకు సంబంధించి రీడింగ్ క్రౌన్ కోర్ట్‌లోని జ్యూరీ.లండన్‌లోని పిమ్లికోకు చెందిన హసన్ అల్ కుబాంజీ (22), డ్రగ్ డీలర్ రియాజ్ మియా (21)ను దోషులుగా నిర్ధారించింది.

ఏప్రిల్ 3న వీరికి శిక్షను ఖరారు చేయనుంది ధర్మాసనం.హెరాయిన్, కొకైన్ సరఫరా చేయడంతో పాటు బహిరంగంగా బ్లేడ్‌ను కలిగి వున్నట్లు మియా గతంలోనే నేరాన్ని అంగీకరించాడు.

ఇక అదే తరహా నేరాలకు గాను అల్ కుబాంజీని జ్యూరీ నిర్దోషిగా గుర్తించింది.

మూడవ ప్రతివాది మిగ్యుల్ పరియన్ జాన్ (42) ఒక నిందితుడికి సహాయం చేసినందుకు గాను రెండు కౌంట్ల అభియోగాలతో దోషిగా తేల్చింది.

ఇతనికి కూడా త్వరలోనే శిక్షను ఖరారు చేయనుంది న్యాయస్థానం. """/" / ఇక స్వతహాగా మంచి బాక్సర్ అయిన కయానీ.

వర్జిన్ అట్లాంటిక్ హీత్రూ చెక్ ఇన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.నాటి ఘటనలో ఛాతీలో కత్తిపోట్లతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

వాగ్వాదం నేపథ్యంలో కాంకోర్ట్ వేలోని ప్లే గ్రౌండ్ నుంచి స్లోఫ్ హిందూ దేవాలయం వైపుకు కయానీ పరిగెత్తగా అతనిని నిందితులు వెంబడించినట్లుగా తెలుస్తోంది.

అయితే రీడింగ్ క్రౌన్ కోర్ట్‌‌కు సమర్పించిన పత్రాల ప్రకారం.నిందితులు మియా, అల్ కుబాంజీలు కయానీ, అతని స్నేహితుడు ఆదిల్ మహమూద్ నుంచి తమను తాము రక్షించుకున్నట్లు తెలిపారు.

"""/" / ఇదిలావుండగా.తాగిన మత్తులో తండ్రిని షాంపైన్ బాటిల్‌తో కొట్టి చంపిన భారత సంతతి వ్యక్తికి యూకే కోర్ట్ గత నెలలో జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

నిందితుడు 54 ఏళ్ల డీకాన్ సింగ్ విగ్ తన 86 ఏళ్ల తండ్రి అర్జున్ సింగ్ విగ్‌ను అక్టోబర్ 30, 2021 సాయంత్రం నార్త్ లండన్‌లోని సౌత్‌గేట్‌లోని తన నివాసంలో హత్య చేశాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.డీకాన్ నగ్నంగా వుండటంతో పాటు అతని చుట్టూ 100 షాంపైన్ బాటిళ్లు కనిపించాయి.

పచ్చిమిర్చిని రోజూ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తెలుసుకోండి!