అమెరికాలో ఆగని తుపాకుల మోత.. షాపింగ్‌ మాల్‌లో కాల్పులు, ఇద్దరి మృతి

అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా అగ్రరాజ్యం అమెరికా .దేశంలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్‌‌కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.

నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.

ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.తాజాగా సోమవారం ఇదాహో రాష్ట్రంలోని ఓ షాపింగ్‌లో సాయుధుడు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా.

మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుల్లో ఒక పోలీసు కూడా వున్నారు.

కాల్పులకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు 911 ద్వారా పోలీసులకు అందజేశారు.అక్కడికి చేరుకున్న పోలీసులు షాపింగ్ మాల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని.

ఒక అనుమానుతుడిని అరెస్ట్ చేశారు.కాల్పుల నేపథ్యంలో స్థానికులకు ఎలాంటి ముప్పు లేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.ఘటన జరిగిన రెండంతస్తుల బోయిస్ టౌన్ స్క్వేర్ మాల్‌లో 150కి పైగా దుకాణాలు, రెస్టారెంట్లు వున్నాయని తెలిపింది.

సామూహిక కాల్పులు, తుపాకీ హింసతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

"""/"/ రెండు రోజుల క్రితం కూడా జార్జియా రాష్ట్రంలోని ఫోర్ట్ వ్యాలీ స్టేట్ వర్సిటీలో క్యాంపస్ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

దాంతో వర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిగాయేమోనని ఆందోళన చెందారు విద్యార్ధులు.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.

దీనిపై విచారణ చేపట్టిన అధికారులు మరణించిన వ్యక్తి వర్సిటీకి చెందిన వ్యక్తి కాదని తేల్చి చెప్పారు.

గాయపడిన వారు కూడా వర్సిటీకి చెందిన వారు కాదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా వర్సిటీ క్యాంపస్‌ను మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?