2.58 కోట్ల అక్రమ మద్యం ధ్వంసం
TeluguStop.com
శ్రీసత్యసాయి జిల్లా( Sri Sathya Sai District )లో భారీ ఎత్తున మద్యాన్ని రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు.
గత ఐదు నెలలుగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ కర్ణాటక మధ్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ( Penukonda ) సమీపంలో మడకశిర రోడ్డు వద్ద గత ఐదు నెలల నుండి కర్ణాటక నుండి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలించిన దాదాపు రెండు కోట్ల 58 లక్షల విలువ గల మద్యాన్ని సీజ్ చేశారు.
సీజ్ చేసిన మద్యం పెనుకొండ శివారు ప్రాంతంలో రోడ్డు రోలర్ తో అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
ఇప్పటికే 826 కేసులు బుక్ చేశామని అంతేకాక కర్ణాటక సరిహద్దు ప్రాంతం దగ్గరగా ఉండడంతో పలుమార్లు కర్ణాటక ( Karnataka )మధ్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న వారిపై పిడి యాక్ట్ లు కూడా పెట్టడం జరిగిందన్నారు.
మరి ముఖ్యంగా ఎవరైనా అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని తీసుకొని వస్తే వాహనం సీజ్ చేయడమే కాక మద్యంకు ఫైన్, వ్యక్తి మీద కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఈ మద్యం కేసుల్లో యాక్టివ్ గా పని చేసిన సిబ్బందిని గుర్తించి వారికి తగిన పారితోషకం కూడా ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
సూర్య సినిమాకు భారీ షాక్.. ఆ పిటిషన్ తో సినిమా రిలీజ్ కు ఇబ్బందులు తప్పవా?