Kodali Nani : ఏపీలో అప్పుల్లో రూ.2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే..: కొడాలి నాని
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chief Chandrababu Naidu ) వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారన్న కొడాలి నాని( Kodali Nani ) సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీకి ఉన్న రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో రూ.
2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనని ఆరోపించారు.
ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రూ.2.
5 లక్షల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు.ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులను తాకట్టు పెడతారని ఆయన తెలిపారు.