కాటికి కాళ్లు చాపుకున్న వయసులో కుస్తీ పోటీ లంటున్న 93 ఏళ్ల తాత

93 ఏళ్ల వయసు అంటే ఒకరకంగా కాటికి కాళ్లు చాపుకొనే వయసు అనే చెప్పాలి.

అలాంటి వయసులో తాతగారు కుస్తీ పోటీలు అంటూ తెగ బిజీ గా ఉంటున్నారు.

ఇంతకీ ఆ తాత గారు ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా.మధురై కి చెందిన 93 ఏళ్ల ఈ ముసలాయన ఇప్పటికీ కుస్తీ పోటీల్లో దుమ్మురేపుతున్నారట.

తన 23 ఏళ్ల అప్పుడు తొలిసారిగా ఈ కుస్తీ పోటీ లోకి దిగిన ఆయన దాదాపు 70 సంవత్సరాలుగా ఈ కుస్తీ పోటీ లలో పాల్గొనడం కానీ, బోధించడం గాని ఇలా ఆయన తెగ బిజీగా ఉంటున్నారు.

"""/"/ 93 ఏళ్ల వయసులో అన్ని విధాలుగా ఆరోగ్యం క్షీణించి చివరికి ఏమీ చేయలేక కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీయాలని చూస్తారు ఎవరైనా.

కానీ ఈ తాతగారు మాత్రం ఆయన ప్రాణం ఉన్నంతవరకు ఈ కుస్తీ పోటీలను మానుకొను అన్నట్లు ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.

అంతేకాకుండా ఈ కుస్తీ ఆట వారి వారసత్వంగా వచ్చిన ఆట కావడం తో ఇప్పటికి కూడా పలువురికి ఈ కుస్తీ పోటీల్లో మెళకువలు నేర్పుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

"""/"/ తొమ్మిది పదుల వయసులోనూ ఆయన ఈ ఆటను ఆడుతూ పలువురికి మెళకువలు అందిస్తున్నారు.

ఎప్పుడో 1994 లో ఈయన ఒక తర్ఫీదు సంస్థను స్థాపించిన ఈయన ఈ 90 ఏళ్ల వయసులో కూడా దానిని కోసాగిస్తున్నారు.

ఆయన వయసు 93 ఏళ్ళు అయినా ఆయన కుస్తీ పట్టు ఆటలో మాత్రం ఒక చిన్న కుర్రాడి గా మారి బరిలోకి దిగి ఈ కుస్తీ పోటీలు నేర్చుకొనేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

నిజంగా ఆయన స్టామినా కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.

ఇదేంటి జగనన్నా… మ్యానిఫెస్టో షాక్ ఇచ్చిందిగా..?