ఎయిరిండియా ఫ్లైట్ 182పై బాంబు దాడికి 39 ఏళ్లు : దర్యాప్తు జరుగుతోందన్న కెనడా పోలీసులు
TeluguStop.com
జూన్ 23, 1985న ఖలిస్తానీ( Khalistani ) ఉగ్రవాదులు ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్కపై జరిపిన బాంబు దాడి ఘటనకు రేపటితో 39 ఏళ్లు గడుస్తోంది.
ఈ దుర్ఘటనపై చురుకైన దర్యాప్తు జరుగుతుందని కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది.పసిఫిక్ ప్రాంతంలోని ఫెడరల్ పోలీసింగ్ ప్రోగ్రామ్ కమాండర్, అసిస్టెంట్ కమీషనర్ డేవిడ్ టెబౌల్ ( David Tebowl )మాట్లాడుతూ.
ఎయిరిండియా దర్యాప్తు సుదీర్ఘమైనదన్నారు.ఖచ్చితంగా ఆర్‌సీఎంపీ చేపట్టిన దేశీయ ఉగ్రవాద పరిశోధనలలో ఇది క్లిష్టమైనదన్నారు.
టోరంటో, మాంట్రియల్, వాంకోవర్, ఒట్టావాలో ఉన్న బాధితుల కోసం నాలుగు స్మారక చిహ్నాలను సందర్శించాలని కెనడియన్లకు టెబౌల్ పిలుపునిచ్చారు.
ఈ ఘోర విషాదంపై స్పందించడానికి, పరిశోధించడానికి కృషి చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏళ్లుగా ఈ స్మారక చిహ్నాల వద్దకు హాజరుకావడం, బాధితులకు నివాళుర్పించడానికి అవకాశం ఉందని టెబౌల్ తెలిపారు.
దేశ చరిత్రలో కెనడియన్లు పాల్గొన్న , ప్రభావితం చేసిన అతిపెద్ద తీవ్రవాద సంబంధిత ప్రాణనష్టం తాలూకా ప్రభావం తగ్గలేదన్నారు.
జూన్ 23, 1985న జరిగిన బాంబు దాడి వల్ల కలిగిన గాయం తరాలను ప్రభావితం చేసిందని టెబౌల్ చెప్పారు.
టాస్క్‌ఫోర్స్ విచారణ కొనసాగుతుండగా.ఇప్పటి వరకు ఈ విషాదానికి సంబంధించి బాంబు తయారీదారుడు ఇంద్రజిత్ సింగ్ రేయత్ మాత్రమే దోషిగా నిర్ధారించబడ్డాడు.
ఫిబ్రవరి 2017లో కెనడా పెరోల్ బోర్డ్ అతనిని ఇంటికి వెళ్లడానికి అనుమతించింది.ఈ ఘటన వెనుక ముగ్గురు వ్యక్తులన్నారని.
వారిలో మిస్టర్ ఎక్స్‌గా పరిశోధకులు పేర్కొన్న వ్యక్తి దాడిలో ఉపయోగించిన బాంబును తయారుచేసే సమయంలో రేయత్‌తో ఒక వారం గడిపాడు.
2005లో బ్రిటీష్ కొలండియా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఐబీ జోసెఫ్సన్ ఈ దాడి వెనుక హింసాత్మక వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమం ఉందని పేర్కొన్నారు.
"""/" /
కాగా.1985 జూన్ 23న ఎయిరిండియా విమానం 182లో (కనిష్క) అట్లాంటిక్ మహా సముద్రంలో ( Atlantic Ocean )కూలిపోయి 329 మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అనుమానితుడిగా వున్న రిపుదమన్ సింగ్ మాలిక్( Ripudaman Singh Malik ) 2022 జూలై 14న కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు.
వాంకోవర్ సమీపంలో గుర్తు తెలియని ముష్కరులు మాలిక్‌పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
"""/" /
1985లో కనిష్క విమాన ప్రమాదం సంభవించిన సమయంలో భారత్, కెనడాలలో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రంగా వుంది.
ఈ ఘోర దుర్ఘటన వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ బబ్బర్ ఖల్సా వున్నట్లుగా అనేక అనుమానాలు, కథనాలు వచ్చాయి.
అయితే ఈ ఘటనలో మాలిక్ ను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకొన్నాయి.2005లో నిర్దోషిగా ప్రకటించబడిన తర్వాత .
ఆయన పేరును బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు.
వైరల్ పోస్ట్: ఏంటి గురూ.. కారును నేరుగా షెడ్ నుండి తెచ్చావా ఏంటి?