1962 సంస్థ ఈఎంఆర్ఐ క్రింద జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సంచార పశు వైద్యశాల సిబ్బంది

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ సెప్టెంబర్ 2017 న ప్రారంభమైన పశు సంచార వైద్య సేవలు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వంద వాహనాలు పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాయి , ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 1962 పశు సంచార వైద్య వాహనాలను నడిపిస్తున్నారు.

ఈ సేవలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని వేల మూగజీవాల ప్రాణాలు కాపాడారు, కానీ గత కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు లేక కుటుంబ పోషణ కూడా ఇబ్బంది గా ఉందన్నారు.

2017 నుంచి ఇప్పటివరకు వేతనాలు పెరగడం లేదు , ఇంక్రూమెంట్లు ఇవ్వడంలేదు యజమాన్యాన్ని అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదంటున్నారని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశు సంచార వైద్య సేవల నిధులు విడుదల చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా?