వాహనాల తనిఖీల్లో 1,84,000/- రూపాయలు సీజ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: సాధారణ అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections )సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక వద్ద వాహనల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 1,84,000/- రూపాయలు ఉండగా అట్టి రూపాయలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేసి జిల్లా గ్రీవిన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని పట్టణ సి.

ఐ ఉపేందర్ తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే రసీదు, తగిన పత్రాలు వాటి వివరాలు ఉండాలని సి.

ఐ తెలిపారు.

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?