18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్.. ఎప్పటి నుండి అంటే..??

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దీంతో చాలా రాష్ట్రాలలో కరోనా బారిన పడిన వాళ్లకి వైద్యం అందని పరిస్థితి.

పరిస్థితి ఇలా ఉండగా కరోనా నియంత్రణ చేయాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ కొరత తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని గత కొంత కాలం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాయి.

వ్యాక్సిన్ వేయించే విషయంలో ఎక్కడ కూడా వయస్సు పరిమితి పెట్టకుండా చూడాలని కేంద్రాన్ని కోరడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా మే ఫస్ట్ నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.

ఇండియాలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో .చాలావరకూ యూత్ వల్ల ఇంటిలో ఉన్న పెద్ద వాళ్ళు కరోనా బారిన పడటంతో.

కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం దేశంలో 45 సంవత్సరాలు పైబడిన వాళ్లకి వ్యాక్సిన్ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే మే ఫస్ట్ నుండి మాత్రం 18 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకులు వీళ్లే.. ఈ నలుగురికే ఆ రేంజ్ టాలెంట్ ఉందా?