భారత్ దగ్గు సిరప్ తో 18 మంది మృతి ఏ దేశంలో అంటే..
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు మన భారతదేశం నుంచి చాలా రకాల మెడికల్ పరికరాలను, మందులను ఎగుమతి చేస్తూ ఉన్నారు.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో భారతదేశానికి చెందిన చాలామంది ప్రజలు నివసిస్తున్నారు.ఈ మధ్యకాలంలో అక్కడక్కడ చిన్న పిల్లలకు వాడే మందులు వికటించి చనిపోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఎందుకంటే ఆ మందులను పిల్లలకి త్వరగా ఆరోగ్యం కుదుటపడాలని ఎక్కువ మోతాదులో వారికి ఇస్తూ ఉంటారు.
అలా అస్సలు ఎప్పటికీ చేయకూడదు.ఎందుకంటే ఎంత మంచి కంపెనీ తయారు చేసిన మెడిసిన్ అయినా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
దాని వల్ల ఎప్పటికీ కూడా ఏ మందునైనా ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు.
అలా ఎక్కువ మోతాదులో తీసుకొని ఇంత మంది చిన్న పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నారు.
భారతదేశానికి చెందిన మరియాస్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన డక్ వన్ మ్యాక్స్ అనే దగ్గు సిరప్ వికటించి ఉబ్బెకిస్తన్ కి చెందిన 18 మంది చిన్నపిల్లలు చనిపోయిన బాధాకరమైన సంఘటన జరిగింది.
ఈ విషయాన్ని ఉబ్బెకిస్తన్ ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.మోతాదుకు మించి సిరప్ వాడడంతో చిన్నారులు చనిపోయినట్లు వెల్లడించింది.
"""/"/
ఇప్పటివరకు హర్యానాకు చెందిన మైడెడ్ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా 63 మంది చిన్నారులు చనిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సంఘటన పై అక్కడి పార్లమెంటరీ ప్యానల్ దర్యాప్తు చేయగా దగ్గు మందులో డై ఎదిలిన్ గ్లైకాల్,ఎదిలిన్ గ్లైకాల్ ఆమోద యోగ్యం కాని స్థాయిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇలా గుర్తించిన కొద్ది రోజుల్లోనే ఉబ్బెకిస్తన్ లో మరో ఘటన జరగడం ఎంతో బాధాకరమైన విషయమే.
దీనిపై భారత ఆరోగ్యం మంత్రిత్వ శాఖ అధికారులు స్పందిస్తూ ఘటనపై తమకు సమాచారం అందిందని అయితే దీనిపై ఇప్పుడే స్పందించలేమని కూడా వెల్లడించారు.
వార్2 సినిమాలో తారక్ డ్యూయల్ రోల్.. ఆ రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తారా?