17వ పోలీస్ బెటాలియన్ కార్యాలయంలో ఘనంగా ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సిద్ధాంతకర్త ప్రోపెసర్ ఆచార్య జయశంకర్  జయంతి వేడుకలను ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో ఘనంగా నిర్వహించారు.

ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకోని ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండంట్ యస్.

శ్రీనివాస రావు ప్రొ.జయశంకర్  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం అధికారులు,ఇతర పోలీస్ సిబ్బంది ప్రొ.జయశంకర్ చిత్రపటం వద్ద  పూలు వేసి నివాళులను ఆర్పించారు.

ఈ సందర్భంగా  బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండంట్  యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం,మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొని దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలిజేశారు అని తెలిపారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ గూర్చి పుస్తకాలు రాసారు అని తెలిపారు.ప్రో.

జయ శంకర్ 2011 లో మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సమయంలో చనిపోయారు అని వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ యమ్.

పార్థసారథి రెడ్డి గారు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు…కారణం ఏంటి..?